కేంద్ర మంత్రి అమిత్ షా కుమారుడు జే షా బీసీసీఐలో కీలక పదవిలో ఉండడంపై వస్తున్న విమర్శలపై బీసీసీఐ చీఫ్ గంగూలీ స్పందించాడు. ప్రముఖ వ్యక్తులు బోర్డులో ఉండడం వల్ల వచ్చే నష్టమేమీ ఉండదని పేర్కొన్నాడు. ఇంటి పేర్లు చూసి మాట్లాడడం కాదని, వాటికి అతీతంగా ఆలోచించాలని అన్నాడు. ‘‘బీసీసీఐ కార్యదర్శి జే షా కేంద్రమంత్రి అమిత్ షా కుమారుడైతే ఏంటి? ఆయన ఎన్నికల్లో గెలిచి ఆ పదవి చేపట్టారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌లో ఆరేడేళ్లుగా ఉన్నారు’’ అని గంగూలీ వివరించాడు. ‘ఇండియా టుడే కాంక్లేవ్ 2019’లో గంగూలీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఇంటిపేర్లు ఉంటే ఏంటి?
Related tags :