Health

చలికాలం చుండ్రు వేధిస్తోందా?

How to beat dandruff in winter season-telugu health news

గసగసాలను పాలతో నూరి, తలకు లేపనం వేస్తే చుండ్రు తగ్గుతుంది.
మందార పూల రసానికి సమంగా నువ్వుల నూనె చేర్చి, నూనె మాత్రమే మిగిలేంత వరకు కాచాలి. ఆ నూనెను తలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది.
మామిడి జీడి, కరక పలుపు ఈ రెంటినీ సమాన భాగాలుగా తీసుకుని పాలతో నూరి తలపైన లేపనం వేస్తే చాలా త్వరితంగా చుండ్రు సమస్య తొలగిపోతుంది.
గురివింద గింజల పొడిని, నీటితో ముద్దగా చేసి, దానికి నాలుగు రెట్లు నువ్వుల నూనె, నూనెకు నాలుగు రెట్లు గుంటగలగర ఆకు రసాన్ని కలిపి నూనె మిగిలేంత వరకు కాచాలి. ఆ తైలాన్ని లేపనంగా పెడితే దురద, చుండ్రు తగ్గుతాయి.
వేపనూనె, కానుగనూనె సమంగా కలిపి అందులో కొంచెం కర్పూరం వేసి రాస్తే చుండ్రు చాలా వేగంగా తగ్గుతుంది
మెంతులను పెరుగుతో నూరి తలకు పట్టిస్తే చుండ్రు బాధల్నించి ఉపశమనం లభిస్తుంది.