Videos

కీరవాణి కొడుకు హీరోగా…

Keeravani Son Sree Simha As Hero In Mattu Vadalara Teaser Video-కీరవాణి కొడుకు హీరోగా...

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహా కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతున్న చిత్రం ‘మత్తు వదలరా’. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌పై చిరంజీవి(చెర్రీ), హేమలత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన నటీనటులతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రితేశ్‌ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. గతంలో టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు ఎన్టీఆర్‌ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయగా, నేడు రామ్‌చరణ్‌ టీజర్‌ను విడుదల చేశారు. ‘నమస్కారం.. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే అంశం అతినిద్ర యొక్క లక్షణాలు. అలుపు, ఆగ్రహం, ఆరాటం, మతిభ్రమణం’ అనే రేడియో కార్యక్రమంలోని డైలాగులతో ఈ టీజర్‌ మొదలవుతుంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్‌ చూస్తుంటే తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీసింహాకు జంటగా ఆత్యుల చంద్ర నటించారు. వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ, సత్య కీలకపాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.