నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో ఓ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. ఈనెలాఖరున సెట్స్‌పైకి వెళ్లబోతోంది. వచ్చే వేసవిలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. కథానాయిక పాత్ర కోసం పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారిలో కీర్తి సురేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే కీర్తితో సంప్రదింపులు మొదలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కీర్తి చేస్తున్న చిత్రాలు పూర్తికావొస్తున్నాయి. కాబట్టి బాలకృష్ణ చిత్రంలో కీర్తి నటించడం దాదాపుగా ఖాయం అనుకోవచ్చు. సంజయ్‌దత్‌ని ప్రతినాయకుడి పాత్ర కోసం ఎంచుకున్నారని సమాచారం. అయితే ఈ విషయాన్ని చిత్రబృందం ఇంకా ధ్రువీకరించలేదు.
శీను-కృష్ణ-కీర్తి
Related tags :