ప్రస్తుతం కాలేజీ అమ్మాయిల నుంచి ఉద్యోగానికి వెళ్లే మహిళల దాకా ఎవరి చేతిలో చూసిన హ్యాండ్‌బ్యాగ్ ఉంటోంది. సౌకర్యంగా, ఫ్యాషన్‌గానూ ఉండే ఇవి అనేక డిజైన్లు, రంగుల్లో లభిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ట్రెండ్‌కు తగ్గట్టుగా, స్టయిల్‌గా ఉండే వాటిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. హ్యాండ్‌బ్యాగ్ కొనేముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలేమంటే…
సైజ్: ఎంత సైజు బ్యాగు అయితే మీకు నప్పుతుందో చూసుకోవాలి. మరీ చిన్నదిగా, మరీ పెద్దదిగా ఉండేవి కొంటే ఎబ్టెట్టుగా ఉంటుంది. మీ ఎత్తును బట్టి మోకాళ్లు, నడుము వరకు ఉండే హ్యాండ్‌బ్యాగ్స్‌ను ఎంచుకోవచ్చు.
మన్నిక: హ్యాండ్‌బ్యాగ్ స్టయిల్‌గా ఉందని చెప్పి ఎక్కువ ఖరీదు పెట్టి కొనొద్దు. ఎక్కువ రోజులు మన్నికగా ఉండే లెదర్ బ్యాగులనే కొనాలి. ఉద్యోగానికి వెళ్లేవారయితే మీరు రోజూ వెంట తీసుకెళ్లే మొబైల్, వాలెట్, లంచ్‌బాక్స్ పట్టేంత స్థలం ఉండే హ్యాండ్‌బ్యాగ్ తీసుకోవాలి.
మ్యాచింగ్: మార్కెట్లో రకరకాల రంగులు, డిజైన్లలో బోలెడు హ్యాండ్‌బ్యాగులు దొరకుతాయి. ఆకుపచ్చ, ఊదా రంగులో ఉండే హ్యాండ్‌బ్యాగ్స్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి. అయితే మీ వార్డ్‌రోబ్‌లోని దుస్తులకు మ్యాచ్ అయ్యేవి కొంటే పార్టీ, ఫంక్షన్ల వేళ ప్రత్యేకంగా కనిపిస్తారు.