ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు హైదరాబాద్‌లోని లేక్ వ్యూ ప్రభుత్వ అతిథిగృహం ఓఎస్డీగా పోస్టింగ్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రోటోకాల్ విభాగంలోని సహాయ డైరెక్టర్ హోదాను పెంచి ఓఎస్డీగా ఆమెకు పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టం చేసింది. రెవెన్యూశాఖలోని సీసీఎల్‌ఏ విభాగం డిప్యూటీ కలెక్టర్‌గా శిక్షణ పూర్తి చేసుకుని పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్న సింధూకు లేక్ వ్యూ అతిథిగృహం ఓఎస్డీగా ప్రభుత్వం తొలి పోస్టింగ్ ఇచ్చింది. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె ఆన్ డ్యూటీ లీవ్‌లో వెళ్లనున్నారు. ఇటీవల తాడేపల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయిన సింధూ.. టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధం అయ్యేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఆన్ డ్యూటీ సెలవులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆమె అభ్యర్థన మేరకు సెలవులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి వచ్చే ఏడాది ఆగస్టు వరకు పీవీ సింధూకు ఆన్ డ్యూటీ లీవ్‌గా పరిగణించనున్నారు.
లేక్‌వ్యూ OSDగా సింధు. వెంటనే సెలవుపై…
Related tags :