చైనాకు ప్రపంచ బ్యాంకు రుణాలు ఇవ్వడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. వారి వద్ద చాలా ధనం ఉందని.. ఇంకా రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఏం ఉందని వ్యాఖ్యానించారు. ‘‘ప్రపంచ బ్యాంకు చైనాకు ఇంకా రుణాలు ఎందుకు ఇస్తోంది?అసలు ఇది ఎలా సాధ్యం? చైనా వద్ద చాలా ధనం ఉంది. ఒకవేళ వారి దగ్గర లేకపోయినా వారు సృష్టించుకుంటారు. ఆపేయండి!’’ అంటూ ట్విటర్‌లో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. చైనాకు 2025వరకు ఏటా ఒక బిలియన్ డాలర్ల నుంచి 1.5బిలియన్ డాలర్ల వరకు తక్కువ వడ్డీ రేటుతో రుణ సహకారం అందించే దిశగా ప్రపంచ బ్యాంకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. గత రెండు సంవత్సరాలుగా చైనాకు ఇచ్చే రుణాలను ప్రపంచ బ్యాంక్ తగ్గిస్తూ వస్తోంది. 2017లో 2.4బిలియన్ డాలర్లు సాయం అందించగా..2019లో అది 1.3బిలియన్ డాలర్లకు చేరిందని బ్యాంకులోని చైనా వ్యవహారాల బాధ్యుడొకరు తెలిపారు.
చైనాకు ప్రపంచ బ్యంకు ఋణాలా? బుద్ధుందా?
Related tags :