Kids

రూపాల మార్పు-తెలుగు చిన్నారుల కథ

Vikramarka Bethaala Stories-Shuffling Between Genders-Telugu Kids Stories

పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, అర్ధరాత్రి సమయంలో, నీ మందిరంలో పట్టుపాన్పుపై నిశ్చింతగా నిద్రపోవలసిన నువ్వు, ఇంత భీతగోల్పే శ్మశానంలో, నానా ఇక్కట్లకూ లోనవుతూండడం చూస్తుంటే జాలి కలుగుతున్నది. ఎంతటి వివేకవంతులూ, ఒక్కొక్కసారి తమ వ్యక్తిగతమైన అతి ముఖ్య విషయాల గురించి, వివేకహీనుల్లా నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటాం. ఇలాంటి వాటికి కారణాలు వేదికిపెట్టడం సాధ్యపడే పని కాదనుకుంటాను! ఇందుకు ఉదాహరణగా, తనను ప్రాణప్రదంగా ప్రేమించిన ఒక యువతి పట్ల, మాళవదేశ యువరాజు ప్రవర్తించిన తీరు యెంత అసందర్భంగా, అవివేకంగా ఉన్నదో చెబుతాను, శ్రమ తెలియకుండా వినే.” అంటూ ఇలా చెప్పా సాగాడు:

మాళవ దేశాన్ని పాలించే వీరసిమ్హుడు వ్రుద్దుడైపోయాడు. ఆయన ఏకైక పుత్రుడు సూర్యవర్మ. సూర్యవర్మ యుక్తవయస్కుదయ్యాడు. కుమారుడికి త్వరలో వివాహం జరిపి, పట్టాభిషేకం చేస్తే తన బాధ్యతా తీరిపోతుందని భావించాడు మాహారాజు. యువరాజు వివాహ విషయంలో తగిన కన్య కోసం అన్వేషణ జరపవలసిన అవసరం కూడా లేదు. కుంతలా దేశపు యువరాణి చంద్రప్రభ, సూర్యవర్మా ఒకరినొకరు మనసారా ప్రేమించుకున్న వాళ్ళు. చంద్రప్రభ తండ్రి వాళ్ళ వివాహానికి ఏనాడో అంగీకరించాడు. అయితే ఆస్థాన పురోహితుడు ఏడాదిగా జాప్యం చేస్తున్నాడు.

ఇలా వుండగా ఒక నాడు సూర్యవర్మా, తన విదూశాకుడిని వెంటపెట్టుకుని రథంలో విహారానికి బయలుదేరాడు. రథం ఒక అరణ్య మార్గాన ప్రయాణం చేస్తోంది. చుట్టూ రకరకాల వృక్షాలు, అడవి జంతువులూ చేసే శబ్దాలు, పక్షుల కిలకిలా రావాలు – సూర్యవర్మకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తున్నది. మధ్య మధ్య విదూషకుడు తన చలోక్తులతో అతడిని నవ్విస్తున్నాడు.

ఈ విధంగా సూర్యవర్మ సూర్యాస్తమయ వేళ వరకూ అరణ్యంలో తిరిగి, చీకటి పడుతూండగా సారధిని రథం వెనక్కి తిప్పి నగరానికి బయలుదేరమని ఆజ్ఞాపించాడు. సారాషి బాగా చీకటి పడక ముందరే నగరం చేరాలని, అశ్వాలను గట్టిగా అదిలించాడు. అవి వాయువేగంతో ఎట్టు పల్లాలుగా వున్న అరణ్య మార్గాన పరిగెత్త సాగాయి.

ఇంతలో హఠాత్తుగా మార్గానికి కొద్ది దూరం నుంచి ఏనుగుల ఘీంకారం వినిపించింది. అది వింటూనే రథాశ్వాలు రెండూ బెదిరిపోయి, రథాన్ని మార్గం నుంచి పక్కకు లాగి, చెట్లు మధ్యగా తమకు ఇష్టమొచ్చినట్టు పరిగెట్టసాగాయి. సారథి వాటిని అదుపు చెయ్యలేకపోయాడు.

సూర్యవర్మ, విదూశాకుడూ, ఈ ఆకస్మిక పరిణామానికి నిశ్చేష్టులయ్యారు. వాళ్ళు కొంతసేపటికి తేరుకుని, రథం నుంచి కిందికి దూకడం క్షేమమా కాదా అని ఆలోచిస్తున్నంతలో, రథచక్రం ఒకటి చేట్టుబోదెను దీకున్నది. దానితో రథం పక్కనున్న పల్లంలోకి ఒరిగింది. విదూశాకుడూ, సారథీ దాపులవున్న పొదల్లో పడ్డారు. సూర్యవర్మ పొడలనానుకుని వున్న ఒక సరస్సులో పడిపోయాడు.

కొంతసేపటికి, తడిసిన దుస్తులతో చలికి వణుకుతూ సూర్యవర్మ సరస్సునుంచి లేచి వచ్చాడు. శరీరం మీద చిన్న చిన్న గాయాలతో చిరిగినా దుస్తులతో పొడలనుంచి లేచి బయటికి రాబోతున్న సారథి, విదూషకుడు, సూర్యవర్మ కేసి చూస్తూ ఒక క్షణం నివ్వెరపోయారు.

అది గమనించిన సూర్యవర్మ, వాళ్ళను, “ఏమిటలా నాకేసి వింతగా చూస్తూ, స్థాణువులా నిలబడిపోయారు?” అని ప్రశ్నించాడు.

అయితే, వాళ్ళు జవాబిచ్చే ముందే సూర్యవర్మ నిలువెల్లా కంపించిపోయాడు. అందుక్కారణం, ఉరుము లాంటి అతడి కంఠస్వరం కోమలంగా వీణ మీటినటుండడమే! అతడు తన శరీరాన్ని ఆపాద మస్తకం ఒకసారి పరీక్షగా చూసుకున్నాడు. చీర, రవిక, చేతులకు గాజులు, కాళ్ళకు అందెలు! చేసిన సాముగరిడీల వల్ల ఉక్కులా వుండే అతడి శరీరం ఎంతో సుకుమారంగా మారిపోయింది.

దానితో సూర్యవర్మకు సారథి, విదూశాకుడూ తనకేసి అంత ఆశ్చర్యంగా ఎందుకు చూస్తున్నారో అర్ధమయ్యింది. ఆ సరస్సులో ఏదో మహత్యం వున్నదని, ఆ కారణంగానే తనకు స్త్రీ రూపం వచ్చిందని అతడు గ్రహించాడు.

తర్వాత ముగ్గురూ మౌనంగా, పల్లంలో ఒరిగివున్న రథాన్ని పైకి లాగి, ఆ రాత్రి తొలిజాము గడిచే సమయానికి నగరం చేరారు.

తమ కుమారుడు ఆడపిల్లగా మారిపోయాడని తెలుసుకుని, రాజడంపుతులు ఎంతగానో విశారించారు. తెల్లవారేసరికి ఈ వార్తా దావానలంలో మాళవరాజ్యమంతటా పాకిపోయింది.

“మన సూర్యవర్మ కాస్తా, సూర్యప్రభాగా మారిపోయాడు!” అంటూ నగర్ పౌరులు తమలోతాము హాస్యమాడుకో సాగారు.

సూర్యవర్మ సిగ్గుతో, ఆ రోజంతా తన భవనం నుంచి బయటికి రాలేదు.

శరీరం స్త్రీత్వం సంతరించుకున్నా, సూర్యవర్మ మనస్సు మాత్రం అందుకు అనుగుణంగా మారలేదు. మనసేమో పూర్వపు సూర్యవర్మలా ఆలోచించేది! ఆకారం స్త్రీది, ఆలోచనాదోరణి పురుషుడిది! ఇలాంటి సంఘర్షణతో సతమతమైసాగాడు, సూర్యవర్మ.

ఒకనాడు రాజు వీరవర్మ, ఆస్థాన దైవగ్నుడిని తన కుమారుడి విషమ సమస్యకు పరిష్కారమార్గం ఏదైనా ఆలోచిన్చావలసిన్డిగా కోరాడు.

అందుకు దైవజ్ఞుడు, “మహారాజా! మన రాజధానికి ఈశాన్య దిశలో గల మహారణ్యంలో, ఒక మాయసరస్సున్నది. దాని ఉనిక బహుకోద్దిమందికి మాత్రమే తెలుసు. ఒకానొక యక్షుడి శాప కారణంగా, అందులో అడుగుపెట్టిన పురుషుడు స్త్రీగాను, నత్రీ పురుషుడుగానూ మారిపోతారు. యువరాజు ప్రమాదవశాన అందులో పాడడం జరిగింది. అది విధి దుష్కృతం అని సరి పెట్టుకోవాల్సిందే తప్ప చేయగలిగిందేమీ లేదు.” అన్నాడు/

రాజు వీరవర్మ, దైవజ్ఞుడు చెప్పింది విని ఎంతగానో కృంగిపోయాడు. ఆయన ఈ పరిస్థితుల్లో చేయవలసిందేమిటో బాగా అలోచించి, ఒక వర్తాహారుడి ద్వారా కుంతలరాజుకు, “మహారాజా! నా కుమారుడు సూర్యవర్మ ఎంతటి విధి వైపర్యానికి లోనుకావలసి వచ్చిందో వినే వుంటారు. ఆ కారణంగా, యువరాజు, చంద్రప్రభను వివాహమాడడానికి యోగ్యుడు కాదు!” అని తెలియ పరిచాడు.

అందుకు ప్రత్యర్తంగా యువరాణి చంద్రప్రభ, సూర్యవర్మకు ఒక లేఖ రాసి వార్తాహరుడి ద్వారా పంపింది. అందులో ఆమె, “యువరాజా! తమకు ఆమోద యోగ్యమైతే, ఆ మాయా సరస్సులో దిగి నేను పురుషుడుగా మారతాను. అప్పుడు మనిద్దరం భార్యా భర్తలు కావడానికి ఎలాంటి ఆటంకము వుండదు” అని రాసింది.

ఆ లేఖను సూర్యవర్మ చదివి, తల్లి తండ్రులకు ఇచ్చాడు. వాళ్ళు యువరాణి చంద్రప్రభ అభిప్రాయం తెలుసుకుని, సూర్యవర్మతో, “నాయనా౧ ఈ లేఖద్వారా, చంద్రప్రభ నిన్నెంత గాఢంగా ప్రేమించిందో అర్ధమవుతోంది. ఆమె చెప్పింది నీకు అంగీకారమే కదా?” అని అడిగారు.

అందుకు స్త్రీ రూపంలో వున్న సూర్యవర్మ కొంత సేపు ఆలోచించి, “చంద్రప్రభ అభిప్రాయం నాకు అంగీకారం కాదు. నేనదుకు అంగీకరించడమంటే, మరిన్ని జాతిల సమస్యల వలయంలో చిక్కుకుపోవడం అవుతుంది. తనకు యోగ్యుడుగా తోచిన రాకుమారుడిని వివాహమాడి, సుఖ పాడమని చంద్రప్రభకు ఈ రోజే లేఖ రాసి పపుతాను.” అన్నాడు.

బేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా! సూర్యవర్మ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకునాదన్న విషయం గురించి, కార్య కారణం సంబంధాలను వేదకజూడడం వృధా శ్రమే అవుతుందికదా? అలా కాదనుకుంటే, అతడు కించిత్తు వివేకం కూడా లేని అహంభావి అని సరి పెట్టుకోవచ్చు. పురుషుడుగా మారిన చంద్రప్రభకు తను భార్యగా అణిగి మణిగి ఉండవలసి వస్తుందన్న ఆలోచన, అతతడిలో మితిమీరిన అహాన్ని రేకేట్టించు వుండాలి. ఒక వేల అతడు చంద్రప్రభను ప్రేమించిన మాట నిజమైతే, మరొకరిని వివాహమాడమని ఆమెకు లేఖ రాయలేదు గదా? ఏది ఏమైనా సూర్యవర్మ ప్రవర్తన వివేక హీనగాను, అసందర్భంగాను లేదా? ఈ సదేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలి పోతుంది.” అన్నాడు.

దానికి విక్రమార్కుడు, “సూర్యవర్మ నిర్ణయానికి మూలకారనమేమితో గ్రహించడం సులువైన పని. దాని కార్యకారణ సంబంధాలు తెలుస్తూనే వున్నవి. స్త్రీ రూపంతో, పురుషుడు మనస్సుతో, జీవించడం అంటే ఎంతటి చిత్రహింసకు గురి కావలసి వస్తుందో, అతడికి తెలుసు. ఒక వేల యువరాణి చంద్రప్రభ సరస్సు దిగి పురుశారూపంలోకి మారినా, ఆమె కూడా తన లాగే మానసిక యాతనకు గురికావలసి వస్తుంది. చంద్రప్రభను ఎంతగానో ప్రేమించిన సూర్యవర్మ, జీవితాంతం ఆమెను అలాంటి బాధకు గురిచేయ్యలేదు. ఆ కారణంగానే అతడు, ఆమె సలహాను తోసిపుచ్చాడు. అంతేతప్ప, ఆ నిర్ణయంలో అవివేకంగాని, అసందర్భంగాని, పురుశాహన్కారంగానీ ఏమిలేదు.” అన్నాడు.

రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ గానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు.