హాలీవుడ్ యాక్షన్ కథానాయకుడు డ్వేన్ జాన్సన్ హిందీ సినిమాలో నటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడా? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘జుమాంజీ: ది నెక్ట్స్ లెవల్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ‘జుమాంజీ: మరో ప్రపంచం’ పేరుతో విడుదల కానుంది. ఈ సందర్భంగా లండన్‌లో చిత్ర ప్రీమియర్ జరిగింది. అక్కడ విలేకరులు ‘బాలీవుడ్ సినిమాలో మిమ్మల్ని చూడవచ్చా’ అని ఆయనను ప్రశ్నించగా, అందుకు డ్వేన్ జాన్సన్ సమాధానం ఇస్తూ.. ‘ప్రస్తుతానికి ఏమీ చెప్పలేను. బాలీవుడ్ ఇండస్ట్రీ అంటే నాకెంతో గౌరవం ఉంది’ అని అన్నారు. ఇక వరుణ్‌ధావన్ గురించి మాట్లాడుతూ.. ‘తను నాకు పెద్ద అభిమాని. సామాజిక మాధ్యమాల వేదిక ఇద్దరం మాట్లాడుకుంటాం. భారత్‌లో అతనో స్టార్ హీరో అని నాకు తెలుసు. ఏదో ఒకరోజు నన్ను బాలీవుడ్ యాక్షన్ సినిమాలో మీరు చూడొచ్చు. అప్పుడు మరింత మజా ఉంటుంది. ఎందుకంటే భారత్‌లోనూ నాకు అభిమానులు భారీగానే ఉన్నారు. త్వరలోనే దీనిపై చర్చిస్తాం’’ అని జాన్సన్ చెప్పుకొచ్చాడు. జేక్ బ్లాక్, కెవిన్ హార్ట్, కారెన్ జిల్లాన్, నిక్ జోనస్ తదితరులు నటించారు
హిందీలోకి కూడా వస్తాను
Related tags :