DailyDose

ప్రాణత్యాగం చేసిన బందరు సైనికుడు-నేరవార్తలు-12/08

Machilipatnam Soldier Dies At Border-Telugu Crime News-12/08

* కర్నూలు జిల్లా మిడ్తూరు మండలం చౌట్కూరులో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగాయి. శివాలయంలో గుప్త నిధుల కోసం విగ్రహాలను ధ్వంసం చేశారు. నంది విగ్రహం కింద కూడా దుండగులు తవ్వకాలు జరిపారు. పోలీసులు విచారణ చేపట్టారు.  ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* మనుషుల ఆలోచనా విధానంలో మార్పు వస్తేనే మహిళలపై అకృత్యాల నివారణ సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న ఘటనలు సిగ్గుచేటని అన్నారు. కొత్త బిల్లులు, చట్టాలు తేవడం వల్ల సమస్య పరిష్కారం కాదని అన్నారు. భారతీయ సంస్కృతిలో మహిళలను తల్లిగా, సోదరిగా పరిగణిస్తామన్న వెంకయ్య…వారికి ఎలాంటి అవకాశాలు ఇచ్చినా సత్తా చాటతారని తెలిపారు. మనుషుల ఆలోచనా విధానంలో మార్పు వస్తేనే మహిళలపై అకృత్యాల నివారణ సాధ్యమవుతుందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. మహారాష్ట్ర పుణెలోని సింబియోసిస్‌ అంతర్జాతీయ డీమ్డ్‌ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కొత్త బిల్లులు తీసుకురావడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు.

* తిరుచానూరు సమీపంలో బాలికపై ఓ అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 24న తిరుపతి- తిరుచానూరు మధ్య ఓ మైనర్​పై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. లిఫ్ట్ ఇస్తామంటూ ఆమెను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. అత్యాచార ఘటన సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని కొద్ది గంటల్లోనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనంతో పాటు రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరిని రౌడీ షీటర్​గా గుర్తించారు

* పోలీసు శాఖకు వచ్చిన ప్రతిష్టాత్మక ‘స్కోచ్‌’ అవార్డును.. మావోయిస్టుల చేతిలో మరణించిన గిరిజనులకు అంకితం ఇస్తున్నామని.. చింతపల్లి ఏఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న భూ సమస్యలపై ఈనెల 11న చింతపల్లిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.

* మచిలీపట్నం , జలాల్ పేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి … దేశ రక్షణ ప్రాణత్యాగానికైనా సిద్ధపడి సైన్యంలో చేరిన సైనికుడు హాజి హుసేన్ అమరుడయ్యాడు … దేశ సైనికుడు హాజీ హుస్సేన్ భౌతిక కాయం స్వస్థలమైన మచిలీపట్నం చేరుకుంది … 3 స్తంభాల సెంటరు నుండి ప్రజలు, స్నేహితులు, బంధుమిత్రులు, దేశభక్తులు, మాజీ సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలిగా జలాల్ పేట లోని స్వగృహము చేరుకుని నివాళులు అర్పించారు … ఉద్ద్యోగ ధర్మంలో భాగంగా దేశ భద్రత కోసం సరిహద్దుల్లో ప్రాణాన్న ప్రనాన్ని అర్పించిన సైనికుడు హాజి హుస్సేన్ కు అత్యంత భక్తి శ్రద్ధలతో నివాళులర్పించారు … సాయంత్రం 4 గంటలకు సైనిక లాంఛనాలతో హాజి హుస్సేన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు

* ఝాన్సీ రోడ్డులోని అనాజ్​ మండీ వద్ద బహుళ అంతస్తుల భవనంలో ఉన్న ఫ్యాక్టరీలో తలెత్తిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఏడు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలన్నారు. పదుల సంఖ్యలో మృతి చెందిన ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు కేజ్రీవాల్. అనంతరం ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. దిల్లీ ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, క్షతగాత్రులకు రూ. 1 లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున మృతులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. బాధిత కుటుంబాలకు భారతీయ జనతా పార్టీ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు అందిస్తామని స్పష్టం చేసింది.

* ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి అంత్యక్రియలు ఈరోజు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, భారీగా తరలివచ్చిన గ్రామస్ధుల కన్నీటి వీడ్కోలు మధ్య అంత్యక్రియలు ముగిసాయి. తొలుత ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వచ్చేవరకూ అంత్యక్రియలు నిర్వహించేది లేదని బాధిత కుటుంబం తేల్చిచెప్పింది. డిమాండ్లను నెరవేరుస్తామని అధికారులు హామి ఇవ్వగా వారు శాంతించారు.

* అనాజ్ మండీ అగ్నిప్రమాద ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు బీజేపీ సాయం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు అందజేస్తామని, క్షతగాత్రులకు రూ.25,000 చొప్పున సాయం అందిస్తామని ప్రకటించింది. బీజేపీ ఎమ్మెల్యే మనోజ్ తివారీ ఆదివారం ఉదయం ఘటనా స్థలిని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఇది చాలా విషాదకర ఘటన. ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.25.000 చొప్పున బీజేపీ సాయం చేస్తుంది’ అని తెలిపారు.

* అర్ధరాత్రి  రోడ్డు ప్రక్కనే ఉన్న ఆటోను పెట్రోల్ పోసి  తగలబెట్టి న ఘటన మండలంలోని సుందరాడ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం సుందరాడ గ్రామానికి చెందిన త్రినాధ్ పండి అనే వ్యక్తి  మెలియాపుట్టి నుండి పాతపట్నం ఆటో నడుపుకుంటూ  కుటుంబాన్ని పోషిస్తున్నాడు.  ఈ క్రమంలోనే ప్రతిరోజూ సర్వీస్ చేసిన అనంతరం సుందరాడలో వారి వీధి ప్రక్కనే ఉన్న రోడ్  ప్రక్కకు పార్కింగ్ చేసేవారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో  ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆటో పై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు. ఈ విషయం మెలియాపుట్టి పోలీసులకు తెలిసి ఘటనా స్థలానికి చేరుకుని ఆటో ఓనర్ త్రినాధ్ పండి ను వివరాలు అడిగారు. ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నట్లయితే వారి పేర్లు తెలియజేయమని పోలీసులు కోరగా ఎవరిపైన  అనుమానం లేదని ఆయన తెలియజేశారు.

* చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. తనిఖీలు చేపట్టిన ఎయిర్‌పోర్టు పోలీసులు షార్జా నుంచి వచ్చిన వ్యక్తి వద్ద 2.8 కిలోల బంగారాన్ని సీజ్‌ చేశారు. ఎయిర్‌పోర్టులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

* తూర్పుగోదావ‌రి జిల్లా గొల్లప్రోలు మండలంలో చందుర్తి శివారులో ఆదివారం అక్ర‌మంగా త‌లిస్తున్న గ్రావెల్ మ‌ట్టిని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. ఇవాళ‌ తెల్లవారుజామున‌ పోలవరం కొట్టు నుండి అక్రమంగా గ్రావెల్ మట్టిని తరలిస్తున్న ఏడు లారీలు, ఒక మిషన్ పై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి చేసి స్వాధీనపరుచుకున్నారు. వాహనాలు గొల్లప్రోలు పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిఐ సత్య కిషోర్ ఆధ్వ‌ర్యంలో ఆరుగురు బృందం దాడి చేసినట్లు తెలిపారు.