ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత రియల్ ఎస్ట్టేట్, నిర్మాణ, మౌలిక రంగ పరిశ్రమలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని అభిప్రాయప డ్డారు. ఈ రంగాల వారికి భారీగా రుణాలిచ్చిన నాన్ బ్యాం కింగ్ ఫైనాన్స్ కంపెనీల ఆస్తుల నాణ్యతా సమీక్షను ఆర్బీఐ నిర్వహించహించాల్సిందేనని రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. రియల్ ఎస్ట్టేట్, నిర్మాణ, మౌలిక రంగ పరిశ్రమల ప్రభావంతో గ్రామీణ భారతంలో కరవు పరిస్థితులు తలెతా ్తయని.. ముందస్తు అంచనాలు లేకుండా రుణాలివ్వడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదుర య్యాయని తెలిపారు. భారత్ ప్రసు ్తతం అభివృద్ధి మాం ద్యాన్ని ఎదుర్కొంటోం దని.. ఆర్థిక వృద్ధి నెమ్మ దించడం వల్ల నిరు ద్యోగం పెరిగిపోయిం దని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో భారత్ జీడీపీ వృద్ధిరేటు 4.5 శాతంగా నమోదై ఆరేళ్ల కనిష్ఠాన్ని తాకడం.. సంక్షోభం కారణంగా రుణాలిచ్చిన వారికి సకాలంలో వసూళ్లు రాకపోవడం వంటి సమస్యలు ఎదురౌతున్నాయి. దీంతో ఆర్బీఐ ఎన్బీఎఫ్సీల ఆస్తుల నాణ్యత సమీక్ష నిర్వహిం చాలని రాజన్ కోరారు. ఆర్బీఐ టాప్ 50 ఎన్బీఎఫ్సీలను స్వయంగా పరిశీలిస్తుండగా.. వాటిలో 75 శాతం సంస్థల ఆస్తులు షాడో బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నాయని ఇటీవల ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించిన నేపథ్యంలో రాజన్ స్పందిస్తూ.. ఆర్బీఐ ఎప్పుడూ ఎన్బీఎఫ్సీలు నష్టపోయేలా ప్రవర్తించకూడదని వ్యాఖ్యానించారు.
ముందు-వెనుక చూడకుండా ఋణాలు ఇచ్చారు…
Related tags :