రాపామైసిన్… సుమారు యాభై సంవత్సరాల క్రితం ఈస్టర్ దీవిలో నేలలో గుర్తించిన ఈ బ్యాక్టీరియాలో యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నట్లు కనుగొన్నారు. ఆ తరవాతి నుంచి దీన్ని మూత్రపిండాల మార్పిడి సమయంలో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఎదురు తిరగకుండా ఉండేందుకు వాడుతున్నారు. అయితే దీనిమీద తాజాగా ఫిలడెల్ఫియాలోని డ్రెక్సెల్ విశ్వవిద్యాలయ నిపుణులు చేసిన పరిశోధనల్లో ఇది చర్మకణాలను నెమ్మదిగా పెరిగేలా చేస్తుందనీ ఫలితంగా వృద్ధాప్యాన్ని అడ్డుకుంటుందనీ కూడా తేలడం విశేషం. దీన్ని క్రీము రూపంలో పదమూడు మందికి ముడతలు పడిన చేతులమీద కొన్ని నెలలపాటు రాసి చూడగా- అది చర్మంలో సాగేగుణాన్ని పెంచి, వయసును పెంచే ప్రొటీన్‌ను అడ్డుకున్నట్లు గుర్తించారు. అదేసమయంలో ఇది రక్తంలోకి ప్రవేశించలేదు కాబట్టి ఆరోగ్యంమీద ఎలాంటి దుష్ప్రభావం కనబరచదని పేర్కొంటున్నారు. త్వరలోనే ఇది మార్కెట్లోకి వస్తే వృద్ధాప్యంలోనూ చర్మ సౌందర్యంతో మెరిసిపోవచ్చన్నమాట.
ముడతలు రూపుమాపే రాపామైసిన్
Related tags :