Politics

నేను తెదేపాను వీడను

I will be with TDP-gottipati ravi confirms

ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి స్పష్టం చేశారు. అధికారులు తన క్వారీల్లో మూడు సార్లు తనిఖీలు చేశారని, గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనిఖీలపై అధికారులు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిని కూడా క్వారీల్లోకి అనుమతించడం లేదని రవి మండిపడ్డారు. ప్రభుత్వం, అధికారులు ఎంత ఇబ్బందులు పెట్టినా పార్టీని వీడబోనని ఆయన చెప్పారు.