DailyDose

జనసేనకు నాదెండ్ల టాటా?-రాజకీయం-12/09

Nadendla Manohar To Bid Farewell To Janasena-Telugu Political News Roundup-12/09

* కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 5వ తేదీన ఉప ఎన్నికలు జరిగాయి. 15 అసెంబ్లీ స్థానాలకు గానూ భారతీయ జనతా పార్టీ 12 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 2, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలను కలుపుకుంటే శాసనసభలో బీజేపీ సంఖ్యా బలం 117కు చేరింది. కాంగ్రెస్‌ 68, జేడీ(ఎస్‌) 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం 112. అయితే బీజేపీకి 117 ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో సీఎం యెడియూరప్ప ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు. ఈ ఏడాది జూలైలో 17 మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్, జేడీఎస్‌లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ వారిపై అనర్హత వేటు వేశారు. దీంతో కుమారస్వామి సారథ్యంలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ పతనమై.. యెడియూరప్ప ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.

* జనసేన పార్టీపై తాజాగా మరో దుమారం మొదలైందా? జనసేన పార్టీలో ఉన్న ఓ కీలక నేత పార్టీ వీడి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా? బిజెపి తో పవన్ చేస్తున్న దోస్తీ అందుకు కారణమా? ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ బిజెపి జాతీయ నాయకుల గురించి చేసిన వ్యాఖ్యలు ఆ నేతకి రుచించలేదా? ఆయన జనసేన పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారా? ఇక ఈ ప్రచారంపై జనసేన పార్టీ ఏం చెప్తుంది? అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జనసేన పార్టీని వీడి వెళ్తున్న నేతలు … గత అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి సత్తా చాటాలని చూసిన జనసేన పార్టీ చిత్తుగా ఓడిపోయింది. తాను పోటీచేసిన రెండు స్థానాల్లోనూ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. ఈ ఘోర ఓటమితో జనసేన శ్రేణులు పూర్తిగా డీలా పడినా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం పార్టీని ముందుకు నడిపించాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలా మంది నేతలు జనసేన ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి పార్టీకి గుడ్ బై చెప్పి పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. గుంటూరు జిల్లా సమీక్షా సమావేశానికి హాజరుకాని నాదెండ్ల ..ప్రచారం షురూ .. ఇప్పటికే రావెల కిశోర్ బాబు జనసేనకు రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీ గూటికి చేరబోతున్నారు. ఈ క్రమంలో మరో కీలక నేత నాదెండ్ల మనోహర్‌పైనా ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా జనసేన పార్టీని వీడి వెళ్లిపోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం లేకపోలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా నిర్వహించిన గుంటూరు జిల్లా సమీక్షకు నాదెండ్ల మనోహర్ హాజరుకాలేదు. ఇక ఆయన కూడా రావెల కిశోర్ బాబు బాటలోనే పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. అమెరికా పర్యటనలో ఉన్న నాదెండ్ల మనోహర్ .. పుకార్లు నమ్మొద్దన్న జనసేన ఆయన ఏ కారణాలతో హాజరు కాలేదో తెలీదు కానీ సోషల్ మీడియాలో ప్రచారం మాత్రం జోరందుకుంది. త్వరలోనే ఆయన జనసేనకు గుడ్‌బై చెబుతారని ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో నాదెండ్ల వ్యవహారంపై జనసేన పార్టీ స్పందించింది. ఆయన సైతం క్లారిటీ ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ అమెరికా పర్యటనలో ఉన్నారని, అందుకే సమావేశానికి హాజరుకాలేకపోయారని తెలిపింది. దీనిపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, నాదెండ్ల పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టంచేసింది. జనసేన పార్టీలో కీలకంగా నాదెండ్ల మనోహర్ … వాస్తవానికి పవన్ కు జనసేన పార్టీలో సపోర్టింగ్ గా నిలుస్తున్న నేత నాదెండ్ల మనోహర్ . ఇక ఆయన పార్టీకి దూరమైతే ఇక పెద్దగా చెప్పుకోదగిన నాయకులెవరు ఆయన పార్టీలో లేరనే చెప్పాల్సిన పరిస్థితి. నాదెండ్ల మనోహర్ గత ఏడాది అక్టోబర్ లో జనసేన పార్టీలో చేరి, గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ జనసేన పార్టీ లోనే కొనసాగుతూప్రజా సమస్యల విషయంలో పవన్ కళ్యాణ్ తో కలిసి పోరాటం చేశారు నాదెండ్ల మనోహర్. పార్టీలో నెంబర్ 2 గా నాదెండ్ల … రాజీనామా ప్రచారానికి చెక్ పడినట్టేనా ..? ఇక పార్టీ ఓడిపోయినా సరే ఆయన మాత్రం పవన్ వెంటే నడిచారు.పార్టీలో ఆయన నెంబర్ 2 అన్న అభిప్రాయం ఉంది. పవన్ కళ్యాణ్ కు రాజకీయ అనుభవం లేకపోవడంతో ఆయన నాదెండ్ల మనోహర్ సలహాలు సూచనలు తీసుకుంటారని తెలుస్తుంది. ఇక ఆయన కూడా పార్టీ వీడి వెళ్లిపోతున్నారని , ఆయనకు పవన్ వ్యవహార శైలి నచ్చటం లేదని తెగ ప్రచారం జరుగుతుంది.కానీ ఆయన అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు . ఇక ఆయన పార్టీని వీడి వెళతారు అన్న ప్రచారానికి చెక్ పడినట్టేనా లేదా అన్నది తెలియాల్సి ఉంది .

* ఇవాళ నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.  దీంతో టీడీపీ నేతలు అసెంబ్లీకి బయల్దేరారు. అసెంబ్లీ ప్రధాన ద్వారం టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులతో అనుమతి లేదని చంద్రబాబును గేటు వద్దే ఆపివేశారు. చంద్రబాబుతో పాటు ఇతర నేతలను గేటు వద్దే నిలిపివేశారు పోలీసులు. దీంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

* ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీఎం జగన్ కామెంట్స్. దిశ నిందితులను కాల్చినా తప్పులేదు. నిందితుల ఎన్ కౌంటర్‌ను సమర్తిస్తున్నాను. తెలంగాణ సీఎం కు హాట్స్ఆఫ్. చట్టాలు మారాలి. మహిళలపై అత్యాచారాలు చేస్తే 21 రోజుల్లోనే శిక్ష పడేలా చట్టాలు తేవాలి. ఇవాళ దిశ హత్య నిందితుల ఎన్ కౌంటర్ పై జాతీయ మనవ హక్కుల కమిషన్ తీరు బాలేదు.. వెంటనే చట్టాలు మార్చితే మహిళలపై దాడులు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

* ఉన్నావ్‌ అత్యాచారం, హత్య ఘటన అనంతరం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం 218 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయడానికి బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలపై అత్యాచారం, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి ఈ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఉన్నావ్‌ బాధితురాలు మరణానంతరం ప్రభుత్వంపై అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో యోగి ప్రభుత్వం ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ఏర్పాటుకు ఆయోద ముద్ర వేసింది. ఈ క్రమంలో.. అత్యాచారం కేసులను విచారించడానికి 144 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను, పిల్లలపై నేరాలకు సంబంధించిన కేసులను విచారించడానికి 74 కోర్టులను ఏర్పాటు చేయనున్నారు.