ఉల్లి ధరలు మండుతుంటే ప్రభుత్వం ప్రజలను వారి ఖర్మకు వదిలేసిందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉల్లిధరలు బంగారంతో సమానంగా ఉన్నాయని విమర్శించారు. ఉల్లి ధరలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని ఆరోపించారు. ఉల్లి ధరలను వ్యతిరేకిస్తూ సచివాలయం ఫైర్‌స్టేషన్ వద్ద చంద్రబాబు అధ్యక్షతన తెదేపా నేతలు నిరసనకు దిగారు. ఉల్లిపాయల దండలు మెడలో వేసుకొని ఆందోళన చేపట్టారు. తక్కెడలో బంగారం, ఉల్లిపాయలు పెట్టి రెండూ సమానమేనని చంద్రబాబు చూపించారు. తెదేపా హయాంలో నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నామని, సబ్సిడీపై తక్కువ ధరలకే అందించామని ఆయన గుర్తు చేశారు.ఉల్లి ధరలు దిగివచ్చేవరకు తెదేపా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఉల్లిపాయ బంగారంతో సమానంగా ఉంది-చంద్రబాబు
Related tags :