అరటిపండ్లలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. అరటిపండ్లలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను పోగొడుతుంది. వాటిలో పొటాషియం, విటమిన్ బి6, సి, మెగ్నిషియం, కాపర్, మాంగనీస్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనకు పోషణనిస్తాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలు మనకు అరటి పండ్లను తినడం వల్ల కలుగుతాయి. అయితే చలికాలంలో మాత్రం రాత్రి పూట అరటిపండ్లను తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. ఎందుకంటే..?
ఆయుర్వేద ప్రకారం.. చలికాలంలో రాత్రి పూట అరటి పండ్లను తినడం వల్ల మన శరీరంలో జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ఆ సమస్యలు ఇది వరకే ఉన్నవారికైతే మరింత ఇబ్బంది కలుగుతుంది. అందుకని అరటి పండ్లను చలికాలంలో రాత్రి పూట తప్ప మిగిలిన ఏ సమయంలోనైనా తినవచ్చని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.