అమెరికాలో సెలవుల సీజన్ ప్రారంభమయింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో ఈ సీజన్‌లో ఆహార సేకరణ, పంపిణీ వంటి కార్యక్రమాలు అమెరికావ్యాప్తంగా చురుగ్గా చేపడుతున్నారు. ఈ క్రమంలో భాగంగా ఒరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్‌ల్యాండ్ తానా కార్యకర్తలు శనివారం నాడు స్థానిక సాల్వేషన్ ఆర్మీలో భారతీయ వంటకాలను ప్రత్యేకంగా తయారు చేసి స్థానిక పేదలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఒరెగాన్ ప్రాంతీయ సమన్వయకర్త లావు దేవ్ పర్యవేక్షించగా శ్రీరాం, జగన్, అరుణ్, త్రివేణి, ఆంజనేయ రాజు, బాల, కలయి తదితరులు తోడ్పడ్డారు. వీరికి తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ అభినందనలు అందజేశారు.
సెలవుల సీజన్‌లో తానా ఒరెగాన్ సేవా కార్యక్రమం
Related tags :