Health

మంచి నిద్ర సొంతం చేసుకోండి

A good nght's sleep helps for an energetic day

ఆదమరిచి హాయిగా నిదురపోమ్మా!
కాసేపు పడుకోవడానికి లేదు…
తెల్లారి పిల్లలకు బాక్సులు కట్టాలి..

రాత్రి ఎంత ఆలస్యమైనా పనిపూర్తిచేసుకోవాలి. ఇక సరిపడేంత నిద్ర ఎక్కడిది? ఇలా బాధపడేవారిలో మీరూ ఉన్నారా? ముందు నిద్ర తగినంత లేకపోతే ఏమవుతుందో చూద్దాం!

ఎన్నో సమస్యలు…

* ఆందోళన, కోపం, అసహనం, మానసికస్థితిలో మార్పులు, ఉద్వేగాల తీవ్రత పెరుగుతాయి.

* థైరాయిడ్‌, వెన్నునొప్పి బాధిస్తాయి.

* ఇన్సులిన్‌ విడుదలలో సమస్యలు వచ్చి చక్కెర వంటివ్యాధులు దరిచేరతాయి.

* శరీరానికి నీరు పట్టి ఊబకాయులుగా మారతారు.

* చిన్నవయసులోనే చురుకుదనం, జ్ఞాపకశక్తి కోల్పోతారు.

మరి పరిష్కారాలేంటి…

జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అలా చేస్తే నిద్ర పోవడానికి తగినంత సమయం లేకపోయినా, దానివల్ల కలిగే నష్టాలను నివారించి శారీరక, మానసిక ఆరోగ్యం బాగుండేందుకు సహాయపడతాయి.

* భోజనం తర్వాత సమయం దొరికినప్పుడు పది నిమిషాలో, 20 నిమిషాలో కునుకు తీస్తే మెదడు ప్రశాంతంగా, చురుగ్గా మారుతుంది.

* ఎక్కువగా నీరు, ద్రవరూప ఆహారం తీసుకోవాలి. మెదడు, నాడులను చురుగ్గా ఉంచే పదార్థాలు, విటమిన్లు, ఖనిజలవణాలు ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

* చాలామంది నేను సన్నగా ఉన్నాను కదా… నాకింక వ్యాయామం ఎందుకులే అని అనుకుంటారు. ఎవరైనా సరే రోజులో కొంతసేపు వ్యాయామం చేయడమో, స్నేహితులతో సరదాగా ఆటలాడటమో చేయాలి.

* శ్వాస వ్యాయామాలు, ప్రాణాయామం, యోగా వంటివాటిని ప్రయత్నించాలి.

* పుచ్చకాయ, అరటి పండు వంటి పండ్లను ఆహారంలో భాగం చేసుకోండి. పాలల్లో కుంకుమ పువ్వు వేసుకుని తాగండి.

కొంతసేెపే అయినా..

నిద్రపోయేది కొంతసేపే అయినా ఎటువంటి ఆటంకాలు లేకుండా పడుకోవాలి. దీన్నే ఆరోగ్యకరమైన నిద్ర అంటారు. అప్పుడే రోజంతా చురుగ్గా ఉంటారు. అదెలా సాధ్యమవుతుందంటే వేళకు పడుకొని, వేళకు మేల్కోవడం నేర్చుకోవాలి. నిద్రపోయే గంట ముందే ఫోన్‌, టీవీ వంటివాటికి దూరంగా ఉండాలి. పడుకునే ముందు కెఫీన్‌, చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోకూడదు. ఇవి మెదడును ఉత్తేజం చేసి నిద్రకు ఆటంకం కలిగిస్తాయి.