* అల్లవరం మండలం కొమరగిరి పట్నంలో పురుగుల మందు త్రాగి దంపతుల ఆత్మహత్య కు యత్నించారు… భర్త, ఆర్ ఎం పి వైద్యుడు చింతలపూడి ధనవంతుడు మరణించారు.. భార్య సుబ్బలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం అమలాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలీయరాలేదు.
* సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో కల్లూరు ఎసిపి వెంకటేష్ మీడియా సమావేశం. నర్సీపట్నం నుండి మహారాష్ట్రకు అక్రమం గా ఇండికా కార్ లో తరలిస్తున్న సుమారు 25లక్షల విలువగల 215 కేజీల గంజాయిని సత్తుపల్లి లో పట్టుకున్నట్లు తెలిపిన ఎసిపి. గంజాయి తరలిస్తున్న కార్ కి రాష్ట్రానికి తగ్గట్టు నెంబర్ ప్లేట్ లు మారుస్తూ అక్రమ రవాణా కు పాల్పడుతున్నాట్లు తెలిపిన ఎసిపి. గంజాయిని తరలిస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరి కోసం గాలిస్తునట్లు ఎసిపి వెల్లడి.
* విశాఖ పోలీసులు కరుడుగట్టిన నేరస్తులను కటకటాల్లోకి నెట్టారు. ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖ నగరం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో ద్విచక్రవాహనలు చోరీలు కు పాల్పడుతున్నముఠా ఆట కట్టించారు. ముఠాలో అత్యంత కీలకమైన ఇద్దరు నేరస్తులైన ప్రకాశ్, రాజులను అరెస్ట్ చేసిన విశాఖ క్రైమ్ పోలీసులు వారి నుండి 26 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. వరుసగా బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో నిఘా వేసిన పోలీసులకు వీరి ఆచూకీ లభించడంతో చాకచాక్యంగా వల పన్ని పట్టుకున్నట్లు విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కే మీనా వెల్లడించారు. అలాగే ద్వారకానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న గ్యాంగ్ ను కూడా అరెస్ట్ చేసి వారి నుంచి పది సెల్ ఫోన్ లతో పాటుగా తులంనర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
* మంచిర్యాల జిల్లాలోని మందమర్రి సాయిమిత్ర గార్డెన్ లో మహిళల భద్రత -పోలీస్ బాధ్యత షీ టీమ్ అవగాహన కార్యక్రమంను రామగుండం పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తున్నామని,అనుకోకుండా జరిగే ప్రమాదాల సమయంలో ఎలా అప్రమత్తంగా ఉండాలో మహిళలకు షీ టీమ్ ల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.మహిళలు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఏమైనా అనుమానం ఉంటే పోలీసులకు డయల్ 100ద్వారా సమాచారం అందించాలని అన్నారు.తల్లిదండ్రులు పిల్లలకు చిన్ననాటి నుండి మంచి క్రమశిక్షణతో పెంచాలని,వారికి పెద్దలను మహిళలను గౌరవించడం నేర్పించాలని,సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి,పోలీసులు,1500మంది మహిళలు పాల్గొన్నారు.