సూర్యగ్రహణం సందర్భంగా ఈ నెల 25, 26వ తేదీల్లో 13 గంటలపాటు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
26 వ తేదీ ఉదయం 8.08 గంటల నుండి ఉదయం 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుందని.. ఆరు గంటలు ముందుగానే ఆలయం తలుపులు మూసివేస్తామని అధికారులు చెప్పారు.
25వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలో దర్శనానికి అనుమతి ఉండదన్నారు.
ఆలయశుద్ధి తర్వాత 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సర్వదర్శనం మొదలవుతుందని తెలిపారు.