మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. సభలో స్పీకర్ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. తెలుగు మీడియం స్కూళ్లపై చర్చ సందర్భంగా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ టీడీపీ నేతలు పట్టుబట్టారు. ఈ సందర్భంగా స్పందించిన స్పీకర్.. ఇదేమన్నా ఖవాలి డ్యాన్సా? ఒకరి తర్వాత మరొకరికి అవకాశం ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యానించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రతిపక్ష నేత చంద్రబాబు.. చైర్‌లో నుంచి లేచి మరీ స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. మర్యాదగా ఉండాలంటూ స్పీకర్‌నుద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. బాబు వ్యాఖ్యలపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పట్ల అనుచితంగా మాట్లాడారంటూ ఫైర్ అయ్యారు. స్పీకర్ చైర్‌ను అవమానించారంటూ మండిపడ్డారు. ామీ మీద నాకు గౌరవం ఉంది. కానీ ఇష్టానుసారం స్పీకర్‌పై ఆరోపణలు చేస్తే మంచిది కాదు్ణ అని చంద్రబాబును స్పీకర్ హెచ్చరించారు. స్పీకర్ చైర్‌ను చంద్రబాబు ఏమాత్రం గౌరవించడం లేదన్నారు. ఇంత సీనియారిటీ ఉండి ఏం లాభం అని ప్రశ్నించారు. తనపై చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తక్షణమే వెనక్కి తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. మరోవైపు చంద్రబాబు వ్యాఖ్యలపై అధికార పక్షం భగ్గుమంది. స్పీకర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను సభ్యులు తప్పుపట్టారు. చంద్రబాబును సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదేమైన ఖవ్వాలి డ్యాన్సా?
Related tags :