గూగుల్‌లో ఈ ఏడాది అత్యధికంగా వెతికిన టాప్-10 ప్రముఖుల జాబితాను గూగుల్ ఇండియా విడుదల చేసింది. గూగుల్ ఇండియా విడుదల చేసిన ఈ జాబితాలో వింగ్ కమాండర్ అభినందన్ మొదటి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో లతా మంగేష్కర్ ఉండగా.. యువరాజ్ సింగ్ మూడోస్థానానికి పరిమితయ్యాడు. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రాణు మండల్ టాప్ 10లో ఏడో స్థానంలో ఉన్నారు. కాగా.. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ నేపథ్యంలో భారత్‌పై పాకిస్థాన్ దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ దాడులను ఎదుర్కొనే ప్రయత్నంలో ఫిబ్రవరి 27న పాక్‌కు చేందిన యుద్ధ విమానాన్ని అభినందన్ కూల్చేశారు. అయితే ఆయన నడుపుతున్న మిగ్ 21 ఫైటర్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూలిపోయింది. ఆ తర్వాత అభినందన్‌ను పాక్ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. దౌత్య ఒత్తిడితో ఆయన్ను మూడు రోజుల తర్వాత భారత్‌కు పాక్ అప్పగించిన విషయం తెలిసిందే.
అభినందన్ కోసం విపరీతంగా వెతికారు

Related tags :