ఉల్లి ధరలు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయినా వరుసగా రెండో వారంలోనూ ధరలు ఆకాశన్నంటుతూనే ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో ఉల్లి ధర సగటున రూ.100కు పైగా పలుకుతోంది. గోవా రాజధాని పణజీలో కిలో ఉల్లి అత్యధికంగా రూ.165కు చేరగా.. కోల్‌కతా, బెంగళూరులో రూ.140, ముంబయి రూ.102, దిల్లీలో రూ.96 వరకు పలుకుతోంది. రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభం కావడం, ఉల్లి పండే రాష్ట్రాల్లో అధిక వర్షాల వల్ల పంటదెబ్బతిని దేశంలో కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎగుమతులను నిషేధించింది. విదేశాల నుంచి లక్షా 20వేల టన్నుల దిగుమతికి ఏర్పాట్లు చేసింది. చిల్లర వర్తకులు ఉల్లిని నిల్వ చేసే సామర్థ్యాన్ని ఐదు నుంచి రెండు టన్నులకు కుదించింది. జనవరి మొదటి వారం వరకు ధరలు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఉల్లమ్మా నువ్వు దిగి రావమ్మా!
Related tags :