WorldWonders

ముంబయిలో ఉల్లిదొంగల అరెస్ట్

ముంబయిలో ఉల్లిదొంగల అరెస్ట్

దేశంలో ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఉల్లి దొంగతనాలు ఎక్కువ అయ్యాయి. కొద్ది రోజుల క్రితం ఓ దొంగ ఓ దుకాణంలోనికి ప్రవేశించి నగదు పెట్టె పక్కనే ఉన్నప్పటికీ దానిని ఏ మాత్రం ముట్టుకోకుండా కేవలం ఉల్లిపాయలను మాత్రమే ఎత్తుకెళ్లాడు ఒక దొంగ. మరో ఘటనలో దాదాపు రూ.20 లక్షల విలువ చేసే ఉల్లి ట్రక్కునే మాయం చేశారు దుండగులు. తాజాగా జరిగిన మరో సంఘటనలో ఏకంగా పొలంలో ఉన్న పంటనే ఎత్తుకెళ్లారు. రోజురోజుకి రాష్ట్రాల్లో ఉల్లి దొంగతనాలు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో ముంబయి పోలీసులు బుధవారం ఉల్లిపాయల దొంగతనంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. వీరు డిసెంబర్‌ 5,6తేదీల్లో డోంగ్రి మార్కెట్‌లోని రెండు దుకాణాలలో సుమారు 168 కేజీల ఉల్లిని దొంగతనం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. వాటి విలువ దాదాపు రూ.20 వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. అక్బర్‌ షైక్‌ దుకాణంలో 112 కేజీలు, ఇమ్రాన్‌ షైక్‌ దుకాణంలో 56 కేజీల ఉల్లిపాయలు దొంగతనానికి గురైనట్లు యాజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.