ఈ డిసెంబర్ 31 లోగా తప్పనిసరిగా ‘పాన్-ఆధార్’ లింక్ చేయాల్సిందే. లేనిపక్షంలో… పాన్ కార్డులు చెల్లవు.
వాటిని ఉపయోగించుకునేందుకు వీలుండదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీఐటీ) ప్రకటించనున్నట్లు సమాచారం.
వాస్తవానికి… పాన్-ఆధార్ లింక్ చేయాలంటూ ఆదాయపు పన్ను శాఖ చాలాకాలం నుంచే చెబుతోంది. ఇప్పటికే పలుమార్లు డెడ్‌లైన్స్ విధించింది కూడా.
‘చివరి తేదీ’లను ఇప్పటికి ఏడు సార్లు పొడిగించింది. ఇక డిసెంబర్ 31 చివరి తేదీ అని కూడా ప్రకటించింది.
అయినా ‘లింక్’ చేయింుకోని ఖాతాదారులు లక్షల సంఖ్యలోనే ఉన్నారు.
ఇదిలా ఉంటే… ‘చివరి తేదీ(డిసెంబరు 31)’ని మళ్ళీ పొడిగించే అవకాశం కనిపించడంలేదని చెబుతున్నారు.
కాగా ఈ డెడ్‌లైన్ తర్వాత ఆధార్‌ను లింక్ చేయని పాన్ కార్డులు ‘పనిచేయనివి’గా గుర్తించాలని ఫైనాన్స్ బిల్లులో సైతం వెల్లడించారు