పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేశారు. మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ప్లకార్డులతో టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులు, జీఎస్టీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, ఆర్థిక సంఘం బకాయిలు, గ్రామీణాభివృద్ధి నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ ఆవరణలో తెరాస ఆందోళన

Related tags :