అమెరికా సమాజానికి హాని కలిగించే విదేశీయులను బంధించి, అవసరమైతే వారిని దేశం నుంచి బహిష్కరించడం యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ విధి. ఈ శాఖ అదుపులోకి తీసుకున్న భారతీయుల సంఖ్య ఏటికేడూ పెరుగుతోంది. 2015లో 3,532గా ఉన్న ఈ సంఖ్య.. 2016లో 3,913కు, 2017లో 5,322కు చేరింది. ఆ తర్వాత 2018లో అత్యధికంగా 9,811కు పెరిగింది. అంటే సుమారు మూడురెట్లయిందన్నమాట. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.యూఎస్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ చేసిన అరెస్టులు, వారిలో జైలుశిక్ష పడినవారు, దేశబహిష్కరణ అనుభవించిన నిందితుల జాబితాను ఇక్కడి ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. దీని ప్రకారం ట్రాన్స్జెండర్లు, గర్భవతుల అరెస్టులు కూడా గతంతో పోల్చుకుంటే 2018లో పెరిగినట్లు తెలుస్తోంది. ఇలా అమెరికాలో అక్రమంగా నివశిస్తున్న వారిని పట్టుకోవడానికి ఇమిగ్రేషన్ శాఖ చేపట్టిన ఆపరేషన్ల సంఖ్య కూడా 1.1లక్షల నుంచి 1.5లక్షలకు పెరిగింది.
అమెరికాలో భారీగా అక్రమ వలస భారతీయుల అరెస్టు
Related tags :