అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం మట్టివారిపల్లె గ్రామానికి చెందిన గుమ్మడికాయల ద్వారకానాథ్ రెడ్డి అక్కడ అమెజాన్ సంస్థలో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య కల్యాణితో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ద్వారకానాథ్ ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారనే విషయం తెలియరాలేదు. ఆయన ఆత్మహత్యతో స్వగ్రామంలో విషాదం నెలకొంది. ద్వారకానాథ్‌కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, వివాదాలు లేవని బంధువులు చెబుతున్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
చిత్తూరు ప్రవాసుడు ద్వారకనాథ్‌రెడ్డి ఆత్మహత్య
Related tags :