దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక పదవిని కట్టబెట్టింది. బౌచర్‌ను ప్రధాన కోచ్‌గా నియమిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని క్రికెట్ దక్షిణాఫ్రికా డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ అధికారికంగా ప్రకటించాడు. వరల్డ్ కప్‌లో ఘోర ఓటమి, వరుస వైఫల్యాలు, బోర్డులో అంతర్గత సమస్యలతో దక్షిణాఫ్రికా క్రికెట్ సంక్షభంలో చిక్కుకుంది. దీంతో ప్రొటీస్ క్రికెటన్ చక్కదిద్దే బాధ్యతను మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌కు అప్పగించింది. దీనిలో భాగంగా దక్షిణాఫ్రికా క్రికెట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్మిత్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు.
దక్షిణాఫ్రికా క్రికెట్ ప్రధాన కోచ్‌గా మార్క్ బౌచర్

Related tags :