కార్తీతో ఆరంభంలోనే ముద్దు సన్నివేశంలో నటించానని నటి నికిలా విమల్ చెప్పుకొచ్చింది. ఈ మలయాళీ కుట్టి ఇంతకు ముందు కిడారి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తరువాత తంబి చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కార్తీ, నటి జ్యోతిక అక్కా, తమ్ముడుగా నటిస్తున్న చిత్రం తంబి. నటుడు సూర్య తన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జీతు జోసఫ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఇది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 20వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. తంబి చిత్రంలో నటుడు కార్తీతో నటించిన అనుభవం గురించి నటి నికిల విమల్ పేర్కొంటూ జీతూజోసప్ దర్శకత్వంలో ఇంతకు ముందే ఒక మలమాళ చిత్రంలో నటించాల్సిందని, కాల్‌షీట్స్ సమస్య కారణంగా నటించలేకపోయినట్లు చెప్పింది. అప్పుడు మరో చిత్రంలో నటించే అవకాశం ఇస్తానని దర్శకుడు తెలిపారంది. అలా ఒక సారి ఫోన్ చేసి తమిళంలో ఒక చిత్రం చేస్తున్నానని, అందులో జ్యోతిక, కార్తీ, సత్యరాజ్ వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారని చెప్పారని తెలిపింది. ఈ చిత్రంలో కార్తీకి జంటగా ఒక పాత్ర ఉంది, నువ్వు నటిస్తావా? అని అడిగారని చెప్పింది.
చుంబనంతో మొదలు
Related tags :