అమెరికన్ తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సామాజిక, సేవా, కళా రంగాల వేడుకల్లో భాగంగా ఆదివారం నాడు ఏలురులో సాంస్కృతికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప-ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి ఆళ్ల శ్రీనివాసరావు(నాని) విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటా ఆధ్వర్యంలో సాంస్కృతికోత్సవం నిర్వహించడం తమకు గర్వకారణంగా ఉందని ఆయన తెలిపారు. ఏలూరులో ఆటా ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, తమవంతు సహాయ సహకారాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. త్వరలో ఏలూరులో కొత్త ఆడిటోరియంను నిర్మిస్తామని ఆయన హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నాట్యాచార్యుడు YMHA కార్యదర్శి కె.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ఆటా నిర్వహించిన సాంస్కృతికోత్సవానికి YMHA సహాయ సహకారాలను అందించిందని పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో పలువురు ప్రముఖ కళాకారులు, జానపద, సాంస్కృతిక ఉత్సవాలను ప్రదర్శించారు. సినీగాయనీ విజయలక్ష్మీ, ప్రముఖ మిమిక్రీ కళాకారుడు సిల్వెస్టర్, ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు డా.అజయకుమార్ ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఆటా అధ్యక్షుడు పరమేశ్ భీంరెడ్డి, ఆటా తదుపరి అధ్యక్షుడు భువనేశ్ బూజాల, ట్రస్టీలు బోదిరెడ్డి అనీల్, రామకృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్సీ RSR మాస్టారు, స్థానిక వ్యాపార వాణిజ్య ప్రముఖులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. కళాకారులను, ఆటా ప్రతినిధులను కె.వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉప-ముఖ్యమంత్రి చేతుల మీదుగా సత్కరించారు. సీనియర్ జర్నలిస్టు కిలారు ముద్దుకృష్ణ ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఏలూరులో అట్టహాసంగా “ఆటా” సాంస్కృతికోత్సవం
Related tags :