ప్రకృతి వ్యవసాయంపై లోతైన అవగాహన కలిగించే లక్ష్యంతో సొసైటీ ఫర్ అవేర్‌నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్‌మెంట్(సేవ్) స్వచ్ఛంద సంస్థ ఈ నెల 22 (ఆదివారం)న కాకినాడలో రైతులకు శిక్షణ ఇవ్వనుంది. ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి? పెట్టుబడి, ఖర్చులు తగ్గించుకునే మార్గాలు, రైతులు పంట దిగుబడులను మొత్తం నేరుగా అమ్ముకోకుండా కొంత మొత్తాన్ని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి అమ్ముకోవడం, అధికాదాయం కోసం ప్రయత్నాలు, దేశీ విత్తనాల ఆవశ్యకత, దేశీ ఆవు విశిష్టత తదితర అంశాలపై సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్ శిక్షణ ఇస్తారు. ఆసక్తి గల రైతులు ముందుగా తమ పేర్లను ఫోన్ చేసి నమోదు చేసుకోవాలి. 86889 98047 94495 96039.
వేదిక: చల్లా ఫంక్షన్ హాల్, వినాయకుని గుడి ఎదుట, విద్యుత్ నగర్, కాకినాడ.
22న కాకినాడలో రైతుశిక్షణ
Related tags :