దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం కియా మోటార్స్ తన లోగోను మార్చుకొనే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆ కంపెనీ కొత్త లోగో కోసం కొరియా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (కేఐపీఆర్‌ఐఎస్)కు దరఖాస్తు చేసుకొంది. స్టైలిష్‌గా తయారు చేసిన 2డీ కార్పొరేట్ లోగోను నలుపు, ఎరుపు రంగుల్లో సిద్ధం చేసింది. ఈ లోగోకు ఇప్పటి వరకు స్థానక సంస్థల నుంచి అనుమతులు రాలేదు. ఇప్పటికే కియా పలు సార్లు ఈ లోగోను ప్రదర్శించింది. ఇటీవల జెనీవా ఆటోషో సందర్భంగా ప్రదర్శించిన ఫ్యూచరాన్ కాన్సెప్ట్ కారుపై ఈ లోగో ఉంది. కియా బ్రాండ్‌కు కొత్త కార్పొరేట్ గుర్తింపు తెచ్చేందుకు లోగో ఉపయోగపడుతుందని కంపెనీ భావిస్తోంది. దీంతోపాటు ఐసీఈ యేతర ఇంజిన్లను అభివృద్ధి చేయడంపై కంపెనీ దృష్టిపెట్టింది. ఈ కొత్త లోగోను భవిష్యత్తులో వచ్చే విద్యుత్తు వాహనాల కోసం ఉపయోగించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో ఫోక్స్ వ్యాగన్ కూడా 2019 జెనీవా ఆటోషోలో సరికొత్త కార్పొరేట్ లోగోను ప్రదర్శించింది.
కియా నయా లోగో
Related tags :