బైక్ రేసింగ్, కార్ల రేసింగ్ గురించి విన్నాం.. బోటు రేసులను కూడా చూశాం.. కానీ ఎప్పుడైనా డ్రోన్ రేస్ గురించి విన్నారా? అందులోనూ వివిధ దేశాలు పోటీ పడతాయని.. ఛాంపియన్లు ఉంటారని ఎంతమందికి తెలుసు? అవును నిజమే.. చైనాలోని జియాంగ్జిన్లో నిర్వహించిన ఎఫ్ఏఐ ప్రపంచ డ్రోన్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఫైనల్ రేసులో కొరియాకు చెందిన చాంగ్యాన్జాంగ్ విజేతగా నిలిచాడు. పురుషుల జూనియర్ విభాగంలో జరిగిన తుదిపోరులో జేజాంగ్ కాంగ్, శామ్హీప్స్లను ఓడించి రేసర్ చాంగ్యాన్ ఛాంపియన్‌గా నిలిచాడు. అంతేకాకుండా టోర్నీ ఫైనల్లోనూ సత్తా చాటాడు. ఆస్ట్రేలియాకు చెందిన థామస్, ఫ్రాన్స్ కిలియన్ రెండు, మూడు స్థానాలకు పరిమితమయ్యారు. మహిళల విభాగంలో థాయ్‌లాండ్‌కు చెందిన 13 ఏళ్ల వన్రాయ వన్నాపాంగ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. యూఎస్‌కు చెందిన సియూన్ పార్క్, టెంగ్ మాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
డ్రోన్ రేసులో విజేత దక్షిణ కొరియా
Related tags :