ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), TLCAలు షాద్‌నగర్‌లో హత్యాచారనికి గురైన దిశకు న్యూయార్క్‌లో నివాళులర్పించారు. ఈ అమానుష చర్య తమను కలిచివేసిందని, భారతదేశంతో పాటు విదేశాల్లోని ప్రవాసులందరూ ఈ హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ పేర్కొన్నారు. ఇలాంటి దారుణ దుర్ఘటనలు పునరావృతం కాకుండా బలమైన, కఠినమైన చట్టాలను తీసుకురావడమే గాక వాటి అమలు పట్ల వివక్షకు తావులేకుండా వ్యవహరించాలని కోరారు. నిర్భయ లాంటి చట్టాలను ఇంకా బలోపేతం చేయవల్సిన అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో తానా మహిళా సేవల విభాగ సమన్వయకర్త శిరీష తునుగుంట్ల, ప్రాంతీయ ప్రతినిధి సుమంత్ రామిశెట్టి, రావు ఓలేటి, హరిశంకర్ రసపుత్ర, శైలజ చల్లపల్లి, సత్య చల్లపల్లి, కృష్ణశ్రీ, దీపిక సమ్మెట, రజని, శ్రావణి, TLCA అధ్యక్షులు అశోక్ చింతకుంట, రమకుమారి వనమ, మాధవి సోలేటి తదితరులు పాల్గొని దిశాకు శ్రద్ధాంజలి ఘటించారు.