ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్), ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)ల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నాడు GenStar Montessori Academyలో ప్రాథమిక యోగా శిక్షణా సదస్సును ఏర్పాటు చేశారు. యోగా గురువులు ప్రశాంత్ దుల్లూర్, శివరాజు జయన్నలు యోగాపై అవగాహన కల్పించారు. తాము దత్త యోగా గణపతి సచిదానందుల ఆశ్రమంలో అభ్యసించామని తెలిపారు. ఆసనాలు, సూర్య నమస్కారాలు, నాడీ శుద్ధి వ్యాయామాలు, యోగా ప్రయోజనాలు వంటివాటిపై వారు విపులంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసులకు వివరించారు. యోగా ప్రక్రియను దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే మంచి ఆరోగ్యవంతమైన జీవనం అలవడుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం, TANA RVP దొడ్డా సాంబ, శ్రీకాంత్ పోలవరపు (తానా ఫౌండేషన్ డైరెక్టర్ ), కళ్యాణి తాడిమేటి(సుఖీభవ కమిటీ సమన్యయ కర్త ), మురళి వెన్నం, కళ్యాణి తాడిమేటి తదితరులు పాల్గొని గురువులను జ్ఞాపికతో సత్కరించారు.
డాలస్‌లో టాంటెక్స్-తానా యోగా సదస్సు
Related tags :