అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల మొనాకో గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో భారత చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి రన్నరప్‌గా నిలిచింది. 12 మంది మేటి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హంపి రెండో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో ఏడు పాయింట్లు సాధించిన హంపి రష్యా ప్లేయర్లు అలెగ్జాండ్రా కొస్టెనిక్, అలెగ్జాండ్రా గొర్యాచికినాతో సమంగా నిలిచింది. అయితే టైబ్రేక్ నిబంధనల ఆధారంగా కొస్టెనిక్ టైటిల్ గెలిచింది. హంపి రెండో స్థానంలో, గొర్యాచికినా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన చివరిదైన 11వ రౌండ్ గేమ్‌లో గొర్యాచికినాపై హంపి 68 ఎత్తుల్లో గెలిచింది. ఈ టోర్నీలో ఆమె మొత్తంగా నాలుగు గేముల్లో విజయం సాధించి, ఆరింటిని డ్రా చేసుకొని, ఒక గేమ్‌లో ఓడింది. మరో భారత క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక 5.5 పాయింట్లతో ఈ టోర్నీలో ఆరో స్థానంలో నిలిచింది.
మొనాకో చదరంగ పోటీలో ద్వితీయ స్థానం
Related tags :