భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బాలీవుడ్ నటి పాయల్ రోహత్గీకి బెయిల్ మంజూరు చేయడానికి న్యాయస్థానం నిరాకరించింది. దీంతో డిసెంబరు 24 వరకు ఆమె జ్యుడీషియల్ కస్టడీలోనే ఉండాల్సి వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబరు 21న ఫేస్‌బుక్ వీడియోలో నెహ్రు కుటుంబ సభ్యులపై పాయల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. నెహ్రు సతీమణి గౌరవానికి భంగం కలిగించే విధంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో పాయల్‌కు వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ లీడర్ చర్మేశ్ శర్మ రాజస్థాన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం (డిసెంబరు 15) ఆమె అహ్మదాబాద్‌లోని స్వగృహంలో ఉండగా అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఎస్పీ మమతా గుప్తా మీడియాతో వెల్లడించారు. పాయల్ ఆదివారం ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘నెహ్రు గురించి వీడియోలో మాట్లాడినందుకు రాజస్థాన్ పోలీసులు నన్ను అరెస్టు చేశారు. గూగుల్‌లో లభించిన సమాచారం చూసి.. నేను అలా మాట్లాడాను. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు జోక్‌గా మారిపోయింది’ అని పేర్కొన్నారు. మరోపక్క కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పాయల్‌పై కేసు గురించి స్పందించారు. పాయల్ చేసిన వ్యాఖ్యలు తప్పని, కానీ దాని కోసం ఆమెను అరెస్టు చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఆమెను విడుదల చేయాలని ట్వీట్ చేశారు.
పాయల్…బెయిల్…నిల్
Related tags :