పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలను అదుపు చేయడంలో భాగంగా పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పౌరులు, పాత్రికేయులు, విద్యార్థుల గళాన్ని నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘‘ ప్రభుత్వం ప్రజల గొంతుకను వినాల్సిన తరుణంలో పోలీసులు విశ్వవిద్యాలయాల్లోకి ప్రవేశించి విద్యార్థులను కొడుతున్నారు. దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజల, పాత్రికేయుల గొంతునొక్కి భాజపా తమ ఉనికిని చాటుకోవాలని చూస్తోంది. ఇది సిగ్గుచేటు. ఈ ప్రభుత్వం పిరికిది’’ అని ప్రియాంక ట్వీట్ చేశారు. ‘‘ప్రజాగళాన్ని వినేందుకు ప్రభుత్వం భయపడుతోంది. ఈ దేశ యువత ధైర్యాన్ని, విశ్వాసాన్ని కేంద్రం అణగదొక్కాలని చూస్తోంది. కానీ, వీరంతా భారత యువత..ఇలాంటి వాటికి తలొగ్గరు. మోదీజీ.. ఈరోజు కాకపోయినా రేపయినా వీళ్ల గొంతును మీరు వినాల్సిందే’’ అని ప్రియాంక వ్యాఖ్యానించారు.
విద్యార్థులను ఎందుకు కొడుతున్నారు?
Related tags :