Movies

నష్టం కలిగించినందుకు దావా

RGV Sues Censor Board Members For Damaging His Movies

తన సినిమాకు నష్టం కలిగించిన సెన్సార్ సభ్యులపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ వెల్లడించారు. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోగా రెండు వారాలు ఆలస్యంగా విడుదలైందని దీనివల్ల నిర్మాతలకు రూ.కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తన నిర్మాణ కార్యాలయంలో వర్మ మీడియాతో మాట్లాడారు. అమ్మరాజ్యం సినిమాపై జరిగిన కుట్రలను బయటపెట్టారు. సినిమా విడుదలకు అడ్డుపడిన వారిపై రూ.20కోట్లు పరువు నష్టం దావా వేస్తున్నట్లు తెలిపారు. దీని వెనుక ఎవరున్నారో విచారణ చేయగా కొన్ని ఆధారాలు లభించినట్లు వర్మ వివరించారు. వారిపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.