ఊరికి కాపలాగా ఉన్న కొండముచ్చు అస్వస్థతకు గురై మృత్యువాత పడడంతో సిద్దిపేట జిల్లా నర్సాపూర్ గ్రామస్థులు కంటతడి పెట్టారు.గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉండడంతో వానరాలను తరిమేందుకు గ్రామస్థులు రాజమండ్రి నుంచి రెండు కొండముచ్చులను కొనుగోలు చేశారు.వాటిని ఊళ్లో కలియతిప్పడంతో పాటు పంటపొలాల వద్ద కాపలా పెట్టడంతో గ్రామస్థులకు కోతుల బాధ తప్పింది.ఇటీవల అందులో ఒక కొండముచ్చు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. గ్రామస్థులు డప్పుచప్పుళ్ల మధ్య సంప్రదాయబద్ధంగా కొండముచ్చుకు అంత్యక్రియలు నిర్వహించారు. కొండముచ్చుకు గుర్తుగా గ్రామంలో ఒక విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
సిద్ధిపేట కొండముచ్చుకు ఘనంగా అంత్యక్రియలు

Related tags :