తెలంగాణ సర్కార్ మందు బాబులకు ఝలక్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న మద్యం ధరల పై 10 శాతం పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఎక్సైజ్ శాఖ జారీ చేసింది.
మంగళవారం నుంచే పెంచిన ధరలు అమలు చేయనున్నారు. ప్రస్తుతం లైట్ బీరు 100 రూపాయలు ఉంది. దీని పై 10 శాతం అనగా పది రూపాయలు పెరుగుతుంది. ఇక నుంచి లైట్ బీరును 110 రూపాయలకు అమ్మనున్నారు. ఇలా ప్రతి దాని పై అమలు చేయనున్నారు.
పెంచిన ధరలు పాత స్టాక్ కు వర్తించవని ఎక్సైజ్ శాఖ తెలిపింది. బీర్ల పై రూ.10 నుంచి 20 రూపాయలు పెరిగింది. క్వార్టర్ పై 20 రూపాయలు, హాఫ్ పై 40 రూపాయలు, ఫుల్ పై 80 రూపాయలు పెంచినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణాలో 10శాతం పెరిగిన మద్యం ధరలు
Related tags :