Movies

రిచా వివాహం

Richa gangopadhyaya gets married in USA

టాలీవుడ్ లో తళుక్కున మెరిసి అంతలోనే మాయమైన అందాల నటి రిచా గంగోపాధ్యాయ్ పెళ్లి చేసుకుంది. అమెరికా యువకుడు జోతో ఆమె వివాహం ఘనంగా జరిగింది. భారతీయ హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం ఈ పెళ్లి నిర్వహించారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల వారు, బంధుమిత్రులు హాజరయ్యారు. రిచా మిరపకాయ్, మిర్చి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె మొదటి చిత్రం రానా హీరోగా వచ్చిన లీడర్. తమిళంలోనూ పలు చిత్రాలు చేసిన రిచా కొద్దికాలానికే నటనకు గుడ్ బై చెప్పేసింది. అయితే, అమెరికాలో ఓ విద్యాసంస్థలో పరిచయమైన జోతో ఆమె ప్రేమలో పడింది. వీరి ప్రేమకు పెద్దలు ఓకే చెప్పడంతో కొంతకాలం కిందట నిశ్చితార్థం జరిగింది. ప్రస్తుతం రిచా పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.