మన పొరుగు దేశమైన శ్రీలంక ఒక సూపర్ కారుకు రూపునిచ్చింది. ఈ కారును 2020 సంవత్సరం మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ కారుకు ‘వేగ’ అని పేరుపెట్టారు. దీనిని 2020 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని కోడ్‌జెన్ సంస్థ సీఈవో హర్షా సుబాసింఘే వెల్లడించారు. గత వారమే ఈ కారుకు పరీక్షలను పూర్తి చేశారు. జెనీవాలో జరగనున్న వార్షిక అంతర్జాతీయ మోటార్ షోలో దీనిని విడుదల చేయనున్నారు. ఆసియా, శ్రీలంకలో తయారైన తొలి సూపర్ కారుగా ఇది ఘనత సాధించనుంది. ఈ కారులో 300 కిలోవాల్టుల బ్యాటరీ ఉంటుంది. ఒక సారి ఛార్జి చేస్తే 240 కిలోమీటర్లు నిరంతరాయంగా ప్రయణించవచ్చు. ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.1క్షణాల్లో అందుకుంటుంది. ఈ కారులోని ఇంజిన్ 900 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. ఈ కారు డిజైన్, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ మొత్తం శ్రీలంకలోనే తయారు చేయడం విశేషం.
ఇది శ్రీలంక సూపర్ కారు
Related tags :