Movies

టబూ సొంత గాత్రం

Tabu To Dub In Her Own Voice For Ala Vaikunthapuram Lo

ప్రముఖ నటి టబు టాలీవుడ్‌కు దూరమై దాదాపు దశాబ్దం దాటిపోయింది. ‘పాండురంగడు’ చిత్రంలో చివరిసారిగా కనిపించిన టబు మళ్లీ తెలుగు తెరపై మెరిసేందుకు సిద్ధమయ్యారు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇందులో టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా టబు తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పటం ప్రారంభించారని సమాచారం. దీని కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. నటనకు తగ్గ వాయిస్‌ అందించేందుకు కేర్‌ తీసుకుంటున్నారట చిత్ర బృందం. ఇన్నేళ్ల తర్వాత ఈమె రీ ఎంట్రీ ఇస్తుండటంతో అందరిలో ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు, పాటలు, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.