టీ20 ప్రపంచకప్‌నకు నాలుగు నెలలు ముందుగానే జట్టు తుదిరూపు సంతరించుకోవాలని టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్ అన్నాడు. వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ సైతం అతడితో ఏకీభవించాడు. ఆజ్‌తక్ వార్తా సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ మాట్లాడారు. ‘ప్రపంచకప్‌నకు నాలుగు నెలల ముందుగానే జట్టు సిద్ధమైపోవాలి. అది 14 మందైనా 16 మందితో కూడిందైనా. ఎలాంటి కూర్పు లభిస్తుందో చూడాలి. శివమ్ దూబెను ఎంపిక చేయడం నచ్చింది. అతడు ఎడమచేతి వాటం ఆటగాడు కావడం జట్టుకు అవకాశం. బౌలింగ్ సైతం చేయగలడు. ఎందుకంటే హార్దిక్ పాండ్య ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు’ అని యువీ అన్నాడు. భజ్జీ సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ముందస్తు సన్నద్ధత ముఖ్యం
Related tags :