Food

కేక్ బేకింగ్ టిప్స్

Cake baking tips for christmas and new year

క్రిస్మస్‌, కొత్త ఏడాది దగ్గరకొస్తుంటే కేకుల సందడి మొదలయినట్టే. కానీ బేకింగ్‌లో నైపుణ్యాలు తెలియకపోతే కేకులు మీరు అనుకున్నట్టు రావు. అందుకే ఈ నైపుణ్యాలపై ఓ లుక్కేయండి.. ●

* మైదా, బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా… కేకు తయారీలో ఈ మూడే కీలకం. అయితే వీటిని తప్పనిసరిగా జల్లెడపట్టుకున్న తర్వాతే తయారీ మొదలుపెట్టాలి. లేకపోతే కేకు విరిగినట్టుగా వస్తుంది.

* బేకింగ్‌ పౌడర్‌ ఒక చెంచా వాడితే బేకింగ్‌ సోడా అరచెంచా సరిపోతుంది.

* కేకులో వాడే మైదా విషయంలో రాజీపడొద్ధు మైదా ఎంత నాణ్యంగా ఉంటే కేకు అంత మృదువుగా ఉంటుంది. బజారులో సెల్ఫ్‌ రైజింగ్‌ ఫ్లోర్‌ అని అడిగితే ఇస్తారు.

* బేక్‌ చేయడానికి అవెన్‌ను 15 నుంచి 20 నిమిషాల ముందుగానే తప్పనిసరిగా వేడిచేసుకోవాలి. కుక్కర్‌ అయినా సరే ముందుగా వేడిచేయాలి.

* బేకింగ్‌ ట్రేకు బటర్‌ లేదా నూనె తప్పనిసరిగా రాయాలి.

* ఉడికిందో లేదో తెలుసుకోవడానికి మాటిమాటికీ అవెన్‌ని తెరిచిచూస్తారు. నిర్ణీత సమయం తర్వాత టూత్‌పిక్‌ తీసుకుని మధ్యలో గుచ్చి చూడాలి. దానికి పిండి అంటుకోకుండా శుభ్రంగా ఉంటే కేకు ఉడికినట్టే.

* కేకు మృదువుగా రావాలంటే పెద్ద పలుకులు ఉండే పంచదారని కాకుండా మెత్తగా ఉండే పంచదార పొడిని కలపాలి.

* డ్రైఫ్రూట్స్‌ను తప్పనిసరిగా కడిగి, తడి ఆరిన తర్వాత కేకు తయారీలో ఉపయోగించాలి. లేదంటే అది పాడయిపోతుంది.

* బేకింగ్‌ అయ్యాక, ఒకరోజు తర్వాత తినాలి. అప్పుడే రుచిగా ఉంటుంది.

* కోడిగుడ్డు వాసన రాకుండా ఉండాలంటే ఎసెన్స్‌ వాడకం తప్పనిసరి.

* కేకులో పచ్చ, తెల్ల సొనలను విడివిడిగా బీట్‌ చేసుకుని తర్వాత కలుపుకోవాలి. ఇలా చేస్తే కేకు బాగా ఉబ్బి చక్కగా వస్తుంది.