తన తల్లిదండ్రులు ప్రియదర్శన్, లిస్సీ విడాకులు తీసుకున్నప్పుడు షాక్‌కు గురయ్యామని ‘హలో’ భామ కల్యాణి ప్రియదర్శన్ గుర్తు చేసుకున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయని, ప్రశాంతంగా జీవిస్తున్నామని అన్నారు. కల్యాణి కోలీవుడ్‌లో నటించిన తొలి సినిమా ‘హీరో’. శివ కార్తికేయన్ కథానాయకుడు. పీఎస్ మిత్రన్ దర్శకుడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబరు 20న విడుదల కాబోతోంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా కల్యాణి ఓ ఆంగ్లపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో తన తల్లిదండ్రులైన లెజెండరీ ఫిల్మ్‌మేకర్ ప్రియదర్శన్, అలనాటి నటి లిస్సీల బంధం గురించి ప్రస్తావించారు. ‘అమ్మానాన్న విడాకులు తీసుకోవడం కుటుంబంపై చాలా ప్రభావం చూపింది. ఈ విషయంలో వారిని నేను ప్రశంసిస్తాను. తమ విడాకులతో మమ్మల్ని నరకంలోకి తోయలేదు. ఇద్దరు ఎమోషనల్‌గా చాలా బాధపడ్డారు. వారు దాన్ని మా వరకు రానివ్వలేదు. అమ్మానాన్న విడిపోవడం మమ్మల్ని షాక్‌కు గురి చేసింది. ఇవాళ మేమంతా సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నాం. అప్పటితో పోలిస్తే ఇప్పుడు వారితో నా బంధం మరింత బలపడింది. ఇది చాలా ముఖ్యమైన విషయం’ అని కల్యాణి చెప్పారు. లిస్సీ, ప్రియదర్శన్ 2016లో తమ 24 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. చెన్నై ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. ఆ సమయంలో లిస్సీ మీడియాతో మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత ఇన్నేళ్లు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని, ఇప్పుడు వాటికి ముగింపు లభించిందని అన్నారు. తన ఇద్దరు పిల్లలు మద్దతు తెలిపారని, దీన్ని గొప్పగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
వారి విడాకులతో నాకు బాధలు
Related tags :