Business

టాటా నిక్సన్ బుకింగ్ ధర ₹21వేలు

TATA Announces New Nixon EV With Booking Price At 21K Rupees

దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటామోటార్స్‌ నేడు నిక్సన్‌ విద్యుత్తు కారు వివరాలను వెల్లడించింది. టాటా నుంచి వస్తున్న రెండో విద్యుత్త కారు ఇది కావడం విశేషం. అంతకు ముంద టిగోర్‌ పేరుతో ఒక విద్యుత్తుకారును టాటా మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనిలో సరికొత్త జిపట్రాన్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ ట్రెయిన్‌ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. కారును 2020 జనవరిలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. దీని ప్రీబుకింగ్స్‌ను రేపటి నుంచి టాటా డీలర్ల వద్ద చేసుకోవచ్చు. రూ.21వేలు చెల్లించి కారును బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ సూచించింది. అసలు ధరను మాత్రం కారు విడుదల సమయంలో వెల్లడించనున్నారు. ఈ కారులో పర్మినెంట్‌ మాగ్నెట్‌ ఏసీ మోటార్‌ను అమర్చారు. ఇది లిథియం అయాన్‌ బ్యాటరీతో పనిచేస్తుంది. దీనికి ఐపీ67 సర్టిఫికెట్‌ ఉంది. దీనికి 30.2 కిలోవాట్ల సామర్థ్యం ఉంది. ఒక సారి ఛార్జి చేస్తే 300 కిలోమీటర్లు ఏకధాటిగా ప్రయాణిస్తుంది.