* మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. కాగా.. రాజధాని తరలింపునకు నిరసనగా విజయవాడ గొల్లపూడి సెంటర్‌లో జాతీయ రహదారిపై మాజీ మంత్రి దేవినేని ఉమ బైటాయించారు. దీంతో రోడ్డుకు ఇరు వైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాజధాని గ్రామస్తులు సైతం ఈ ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు దేవినేని ఉమను అరెస్ట్ చేశారు.
* పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని భగ్గుమంటున్నక్రమంలో ఢిల్లీలో నెలకొన్న పరిస్థితి అప్రకటిత ఎమర్జెన్సీయేనని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనలు హోరెత్తడంతో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో పలుచోట్ల 144 సెక్షన్ విధించడం, 18 మెట్రో స్టేషన్లను మూసివేసిన నేపథ్యంలో దేశంలో బీజేపీ పాలన సాగడం లేదని అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. ‘దేశ రాజధానిలో ఎర్రకోట చుట్టూ 144 సెక్షన్ విధించారు, నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నారు. 18 మెట్రో స్టేషన్లు మూసివేశారు..ఇంటర్‌నెట్‌ను నిలిపివేశారు..కర్ణాటకలోనూ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు..యూపీ, అసోంలో ఇదే తరహా దమనకాండ కొనసాగుతోంద’ని సింఘ్వి అన్నారు. డీ రాజా, సీతారాం ఏచూరి, అజయ్ మాకేన్, సందీప్ దీక్షిత్, యోగేంద్ర యాదవ్,ఉమర్ ఖలీద్‌లను అదుపులోకి తీసుకున్నారు.
* దిశగా ఘటనతో స్పందించిన హైకోర్టు మహిళలపై జరుగుతున్న అత్యాచారాల విచారణను వేగవంతం చేసేందుకు నిర్ణయం తీసుకున్న తెలంగాణ హైకోర్టు విచారణ కోసం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తులను నియమించిన సిజే ఇకపై ఎలాంటి అత్యాచారం ఘటన చోటు చేసుకున్న ప్రత్యేక కోర్టులో వేగవంతంగా జరగనున్న విచారణ
* జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ బాధితులు కలిశారు. యాలేరు గ్రామం మహిళలు తమకు జరిగిన అవమానాన్ని బాబుకు వివరించారు. బాధితురాలు కురుబ అలివేళమ్మ మాట్లాడుతూ మహిళని కూడా చూడకుండా రోడ్డు మీదకి తీసుకువచ్చి జుట్టు కత్తిరించారని కన్నీరుమున్నీరైంది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు పెడితే వైసీపీ నేతలపై కేసులు కూడా పెట్టలేదని వాపోయింది. వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి నిందితులను వెంటపెట్టుకొని తిరుగుతున్నారని, నడిరోడ్‌లో ఈడ్చి కొడుతున్నారంటూ ఆమె బోరున ఏడ్చింది.
* బీహార్‌లో సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (సిఎఎ)కు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో నేడు బంద్ జరుగుతోంది. సిపిఎం కార్యకర్తలు లహెరిసరాయ్ రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్టాలకు అడ్డంగా నిలబడి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. బీహార్ బంద్‌కు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది.
* ఢిల్లిలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు తెలిపింది. ”ప్రభుత్వ ఆదేశాల మేరకు వాయిస్, ఎస్‌ఎంఎస్, ఇంటర్నెట్ సేవలను నలిపివేశాం” అని ఎయిర్‌టెల్ రెండు ట్వీట్లలో పేర్కొంది. తరువాత ఆ ట్వీట్లను తొలగించింది. దేశరాజధానిలో అనేక మీడియా సంస్థలు సహా పలు కార్యాలయాలు ఉన్న అతి ముఖ్యమైన ప్రదేశం ఐటిఒ వద్ద ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
* లౌకిక వ్యవస్థకు తూట్లు పొడుస్తున్న మోడీ సర్కార్ కి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు మహాధర్నా. లెలిన్ సెంటర్ లోని ధర్నా చౌక్ లో ఆందోళన.. పాల్గొన్న ఎంపీ కేశినేని నాని సీపీఐ,సిపిఎం రాష్ట్ర కార్యదర్శిలు రామకృష్ణ , మధు ,ఎమ్మెల్సీ లక్ష్మణరావు. సీఏఏ ,ఎన్ఆర్సీ బిల్లును తక్షణమే ఉపసంహరించు కోవలని డిమాండ్. రాజ్యాంగలోని 14,15, 25 అధికారణలను ఉల్లాగిస్తూ బిల్లులను తీసుకురావడాన్ని ఖండిస్తున్నాం.. దేశ సమానత్వనికి, బహులత్వానికి ఈ బిల్లులు వ్యతిరేకం… బిల్లులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న విద్యార్థుల పై దాడులు చేయడం అమానుషం.
* ట్రాన్స్కో విజిలెన్స్ అడిషనల్ శ్ఫ్ తంగెల హరికృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కారణంగా ఏసీబీ దాడి.
* అమరావతి రాజధాని ని మార్చవద్దంటూ ఆందోళనలు గొల్లపూడి సెంటర్ లో జాతీయ రహదారి పై బైటాయించిన మాజీ మంత్రి దేవినేని ఉమ రోడ్డుకు ఇరు వైపులా నిలిచిపోయిన వాహనాలు మా పై ఎందుక ఈ పగ, అమరావతి రాజధానిగా ఉంచాలంటూ ప్లకార్డులతో ఆందోళనలో పాల్గొన్న గ్రామస్తులు.
* విశాఖపట్నం జిల్లాలో మీసేవా నిర్వాహకులు, మరియు ఆపరేటర్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రేపు ఉదయాన్నే రాష్ట్ర బంద్ కు మీసేవా పలు సంఘాలు పిలుపునిచ్చారు.
* చీరాల మండలం వాడరేవు లో బి.సి బాలుర వసతిగృహం పై ఎసిబీ దాడులు. 9 మంది మాత్రమే హాస్టల్ లో ఉండగా 86 మంది విద్యార్థులను రిజిస్టర్ లో చూపిస్తున్న వార్డెన్ హరిప్రసాద్ రావు. గుంటూరు ఎసిబీ అడిషనల్ ఎస్పీ సురేష్ అద్వరంలో హాస్టల్ లో సోదాలు. సిబ్బందిని విచారిస్తున్న ఎసిబి అధికారులు పారారిలో హాస్టల్ వార్డెన్ హరిప్రసాదరావు.
* పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనతో దేశ రాజధాని దిల్లీ మహానగరం మరోమారు రణరంగంగా మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో నిరసనకారులు ర్యాలీ నిర్వహించారు. పౌర చట్టానికి వ్యతిరకేంగా, జామియా ఇస్లామియా, అలీగఢ్ ముస్లిం వర్శిటీలో పోలీసుల చర్యను నిరసిస్తూ.. విద్యార్థులు, కార్యకర్తలు ర్యాలీలకు పిలుపునిచ్చిన క్రమంలో పలు ప్రాంతాంల్లో ఆంక్షలు విధించారు అధికారులు. ఎర్రకోట ప్రాంతంలో 144 సెక్షన్ విద్యార్థుల ర్యాలీ నేపథ్యంలో ఎర్రకోట ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు అధికారులు. అయితే.. ఆంక్షలు లెక్కచేయకుండా జామియా, జేఎన్‌యూ, దిల్లీ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఎర్రకోట ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పౌర చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆంక్షలను లెక్క చేయకుండా ఎర్రకోట ప్రాంతంలో ఆందోళనకు దిగిన వందల మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విద్యార్థులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇందులో స్వరాజ్య అభియాన్ అధినేత యోగేంద్ర యాదవ్ ఉన్నారు. వామపక్ష నేతల అరెస్ట్ సెంట్రల్ దిల్లీలోని మండి హౌస్ ప్రాంతంలో సంయుక్త మార్చ్ నిర్వహించాయి లెఫ్ట్ పార్టీలు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు డి. రాజా, సీతారాం ఏచూరి, నిలోత్పల్ బసు, బృందా కారత్ సహా ఇతరులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 16 మెట్రో స్టేషన్ల మూసివేత పౌర చట్టం వ్యతిరేక అల్లర్లు ఉద్రిక్తంగా మారిన క్రమంలో దిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ భద్రత చర్యలు చేపట్టింది. నగరంలోని 16 మెట్రో స్టేషన్లలోని ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను మూసివేసింది. సీలంపుర్‌లో మరో 12 మంది అరెస్ట్ పౌర చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గత మంగళవారం ఈశాన్య దిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి మరో 12 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో ఐదుగురు జఫ్రబాద్, నలుగురు దయాల్ పుర్ కేసుకు సంబంధం ఉన్నవారిగా పేర్కొన్నారు. గత మంగళ, బుధవారాల్లో 9 మందిని అరెస్ట్ చేశారు. భారీగా ట్రాఫిక్ జాం ఆందోళనలతో దేశ రాజధాని అట్టుడుకుతోంది. ఈ కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. దిల్లీ-గుర్గావ్, దిల్లీ గేట్-జీపీఓ, సుభాష్ మార్గ్, పీలి కోఠి, శ్యామ ప్రశాద్ ముఖర్జీ మార్గ్, ఎర్రకోట, పాత దిల్లీ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు చేయడం వల్ల మరింత ఆలస్యమవుతుంది.
* మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ నేతలు.. పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారని మండిపడింది. వేదికపై జేసీ అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయనను వారించకపోవటం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేసింది. బూట్లు తుడిచేందుకు తాము టీడీపీ బానిసలం కాదని, బుల్లెట్లు ప్రయోగించటంలో శిక్షణ పొందిన ప్రజాసేవకులం అని పేర్కొంది. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించింది. జేసీ దివాకర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పోలీసుల సంఘం డిమాండ్ చేసింది.
* మంగళగిరి సమీపంలో మంగళగిరి విలేకరుల మీద మాజీ ఎమ్మెల్సీ టి జి వెంకట కృష్ణారెడ్డి గన్ మెన్ల దౌర్జన్యం . శర్మ దాబా దగ్గర రోడ్డు దాటుతున్న విలేకరిని అటుగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్సీ సిబ్బంది వాహనాన్ని ఆపి ఇద్దరు విలేకరుల మీద చేయు చేసుకోవడం జరిగింది . దీని మీద తనకు న్యాయం జరిగేంత వరకు పోరాటానికి సిద్ధమైన మీడియా ప్రతినిధులు ఈ విషయం గురించి మంగళగిరి పోలీస్ స్టేషన్లో అడిషనల్ ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది అడిషనల్ ఎస్పీ విచారణ చేసి విలేకరులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.